స్టార్ హీరోను బ్రదర్ పిలిచిన సాయి పల్లవి
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. సాయి పల్లవి ప్రస్తుతం 'అమరన్' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా చెన్నై వేదికగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ సాయి పల్లవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో టీవీ యాంకర్‌గా పని చేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. ఆ కార్యక్రమానికి సాయి పల్లవి గెస్ట్‌గా వచ్చారు.ప్రేమమ్ సినిమాలో ఆమె నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఫోన్ చేసి సాయి పల్లవికి అభినందనలు తెలిపాను. దీనిపై సాయి పల్లవి రియాక్ట్ అవుతూ 'థ్యాంక్యూ అన్నా' అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీల్ అయ్యానని సాయి పల్లవితో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. సాయి పల్లవి అప్పటికీ ఇప్పటికీ గొప్ప నటినే అంటూ శివ కార్తికేయన్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే..నాగ చైతన్యతో 'తండేల్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో 'రామాయణం' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications