విడాకుల తర్వాత తొలిసారి అక్కినేని ఫ్యామిలీతో సమంత..ఫుల్ ఎమోషనల్ సీన్

హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను గతేడాది వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు.

విడాకుల తర్వాత సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని అంతా భావించినప్పటికీ, ఆమె ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే రాజ్ నిడిమోరుతో సమంత కలిసి తరచూ కనిపిస్తున్నారు. ఇటీవల సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజ్ నిడిమోరు ఆమెతో కలిసి కనిపించారు. అలాగే సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా పని చేశారు. దీంతో వీరి మధ్య రిలేషన్ నిజమే అని అంతా భావిస్తున్నారు.

Samantha and Akkineni Amala on the same stage

ఇదిలా ఉంటే సమంత , అక్కినేని ఫ్యామిలీతో కలిసి దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల తర్వాత సమంత అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్క వ్యక్తిని నేరుగా కలిసింది లేదు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో సమంత వేదికను పంచుకున్నారు.జీ తెలుగు నిర్వహించిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సమంత, అక్కినేని అమల కలిసి కనిపించారు.

తాజాగా జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్‌ కార్యక్రమం నిర్వహించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సమంత, అక్కినేని అమల కనిపించారు.సమంత ఎమోషనల్‌గా మాట్లాడుతున్న సమయంలో అక్కినేని అమల చప్పట్లు కొడుతున్నట్టు ఈ ప్రోమోలో చూపించారు. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గానూ సమంతకు అవార్డు దక్కగా, 30 ఏళ్లకి పైగా జంతు సంరక్షణ చేపట్టినందుకు అక్కినేని అమలకు అవార్డు దక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+