తగ్గేదేలే... ఆ విషయం గురించి మరోసారి ప్రస్తావించిన సమంత

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాలు సంపాదించిన సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాగచైతన్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్న తర్వాత ఆమె రెండో పెళ్లి గురించి ప్రస్తావనే తీసుకురాలేదు. చేసుకునే ఉద్దేశమే లేదని గతంలోనే స్పష్టంచేసింది. అయితే రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయంటున్నారు. ఒకసారి వెబ్ సిరీస్ డైరెక్టర్ తో, మరోసారి బాలీవుడ్ హీరోతో సమంత డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లిచేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయికానీ వాటిని సమంత టీం ఖండిస్తోంది. బాధ్యతారాహిత్యమైన వార్తలను రాయొద్దని మీడియాను కోరుతోంది.

ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది
ఈ తరుణంలోనే సమంత మరోసారి మయోసైటిస్ గురించి ప్రస్తావించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాటిని ప్రేక్షకులతో పంచుకున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడే కాస్తంత నీరసంగా అనిపించిందని, ఓపిక లేకపోయినా ఎలాగోలా ఆ షోను పూర్తిచేసి వెంటనే హైదరాబాద్ వచ్చేశాని చెప్పింది. ఆ తర్వాతరోజు ఖుషీ షూటింగ్ లో పాల్గొన్నానని, కానీ శరీరం అప్పటికే బాగా నీరసించి పోయిందని, అప్పటినుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందని, ఏం జరుగుతుందో తనకు అర్థంకాలేదని వివరించింది. అది మయోసైటిస్ అనే వ్యాధి అని గుర్తించడానికి చాలా సమయం పట్టిందని, ఆ తర్వాత తాను దాన్ని గురించి ఎదుర్కొన్న సవాళ్లు అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించింది.

Samantha talks about how she was first diagnosed with myositis

అప్పుడే విడాకుల గురించి తొలిసారిగా ప్రస్తావన
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలోనే సమంత తొలిసారిగా తన విడాకుల గురించి ప్రస్తావించారు. అప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. మయోసైటిస్ సోకడంతో సినిమాలకు ఏడాదిన్నర సమయం దూరంగా ఉన్నారు. అదే సమయంలో తాను సినిమాలు చేయడానికి నిర్మాతల దగ్గర నుంచి ముందుగా తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను కూడా వారికి తిరిగిచ్చేశారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. అలాగే కొన్ని దేశాలకు విహారయాత్రలకు వెళ్లి, తాను ఎక్కడున్నప్పటికీ విషయాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేవారు. సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే చెబుతోంది. ట్రూలాలా అనే సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానరుపై తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో హీరోయిన్ ఓరియంటెండ్ సినిమా చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+