రకుల్ భర్తపై మహిళ ఉద్యోగి సంచలన ఆరోపణలు
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది.
ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. గోవాలో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ భర్త జాకీ భగ్నానీపై ఓ మహిళ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. రకుల్ భర్త జాకీ భగ్నానీకు బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కించారు. ఈ సంస్థ నుంచి ఇటీవల బడే మియా చోటే మియా సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో రకుల్ భర్త జాకీ భగ్నానీ నష్టాల్లో కూరుపోయారు. దీంతో 2 నెలల జీతాన్ని 2 సంవత్సరాలుగా ఇవ్వట్లేరని పూజా నిర్మాణ సంస్థపై ఉద్యోగులు పోస్టులు పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అయితే బాలీవుడ్ రూల్స్ ప్రకారం 45-60 రోజుల్లో డబ్బులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు తమకు జీతాలు ఇవ్వలేదని వైష్ణవి అనే ఉద్యోగి అసలు విషయాలు చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. నాతో పాటు 100 మందికి జీతాలు ఇవ్వడం లేదు. ఇందులో నటించిన ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ వెంటనే ఇచ్చారు. కానీ సినిమా కోసం కష్టపడి పని చేసిన తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా సొంత డబ్బు కోసం వారు చేసినవన్నీ బయట పెట్టక తప్పడం లేదు. తిండి కూడా సరిగ్గా పెట్టరు. మా ప్రశ్నలకు నిర్మాత దగ్గర సమాధానాలు కూడా లేవు. ఈ సంస్థలో పని చేయకండని ఆ మహిళ ఉద్యోగి చెప్పుకొచ్చారు.జాకీ భగ్నానీ కోట్లు సంపాదిస్తూ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం ఏంటని బాలీవుడ్ జనాలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications