Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..?

విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు.. ఓ తరాన్ని మార్చే ఆయుధం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా, నటి, సామాజిక సేవకురాలు లక్ష్మీ మంచు నేతృత్వంలో నిర్వహించిన టీచ్ ఫర్ ఛేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026.. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ వేడుక, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సినిమా, రాజకీయం , కార్పొరేట్ రంగాలను ఒకే తాటిపైకి తెచ్చింది.

ముఖ్య అతిథుల సందడి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మద్దతుగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఇరిగేషన్ శాఖ), సీతక్క (మహిళా & శిశు సంక్షేమ శాఖ), ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. నాణ్యమైన విద్య అనేది ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వాలు , స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే సామాజిక మార్పు సాధ్యమని వారు ఈ సందర్భంగా స్పష్టంగా చేశారు.

Teach for Change 2026 Lakshmi Manchu Hosts Grand Fundraiser in Hyderabad for Govt Schools

ర్యాంప్ వాక్.. సేవ కోసం తారల మెరుపులు
ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణ సెలబ్రిటీల ఫ్యాషన్ షో. విద్యా సేవకు మద్దతుగా టాలీవుడ్ , భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ర్యాంప్ వాక్ చేశారు. లక్ష్మీ మంచు, పాయల్ రాజ్‌పుట్, సీరత్ కపూర్, హెబ్బా పటేల్, ఫరియా అబ్దుల్లా, సుహాసిని, జయప్రద వంటి సీనియర్ , యంగ్ స్టార్స్ తమ మెరుపులతో వేదికను మురిపించారు. ప్రముఖ డిజైనర్ రామ్‌జ్ రూపకల్పన చేసిన దుస్తులు, రోజ్ జ్యువెలరీ ఆభరణాలు ధరించి తారలు నడిచిన ప్రతి అడుగు ప్రభుత్వ పాఠశాలల పిల్లల అక్షర జ్ఞానానికి భరోసానిచ్చింది.ప్రియదర్శి, నందు, నిఖిల్ విజయేంద్ర సింహ వంటి యువ నటులు కూడా ఈ సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

3 లక్షల మంది విద్యార్థులకు వెలుగు
2014లో స్థాపించబడిన 'టీచ్ ఫర్ ఛేంజ్' సంస్థ గడిచిన పదేళ్లలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమించింది. దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా విద్యార్థుల జీవితాల్లో మార్పు తెచ్చింది. 1,549 ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఐసీటీ సదుపాయాలు , ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా మద్దతు అందించింది. ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడం, డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం.

లక్ష్మీ మంచు ఆకాంక్ష
ఈ సందర్భంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. "ప్రతి చిన్నారి నేపథ్యం ఏదైనా సరే, వారికి ప్రపంచ స్థాయి విద్య అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారానే దేశ భవిష్యత్తు మారుతుంది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, లక్షలాది మంది పిల్లల కలలను నిజం చేసే ఒక నిరంతర ప్రయాణం" అని భావోద్వేగంతో చెప్పారు.ప్రీమియర్ ఎనర్జీస్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, నోవోటెల్ హైదరాబాద్, హెచ్ఐసీసీ సహ-ఆతిథ్యమిచ్చాయి. సమాజంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ www.teachforchange.in ద్వారా ఈ గొప్ప కార్యంలో భాగస్వాములు కావాలని సంస్థ కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+