అలా చేసుంటే కన్నప్పకి వెయ్యి కోట్లు కలెక్షన్స్ - తమ్మారెడ్డి
మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం " కన్నప్ప ". ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. మొదటి రోజు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాత నెమ్మదించిందని టాక్ వినిపిస్తోంది.
కాగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమా చూశానని నిజంగా చాలా బాగుందని తెలిపారు. ఆ సినిమా కెపాసిటీకి, ఆ హీరో పొటెన్షియాలిటీకి తగిన విధంగా.. ఎంత రావాలో అంత వచ్చేన్నాయి. పాన్ ఇండియా పిచ్చిలో మనం ఎక్కువ ఖర్చు పెట్టి, కలెక్షన్స్ రావట్లేదు అనడం కరెక్ట్ కాదన్నారు. పాత 'కన్నప్ప'కి కొత్త 'కన్నప్ప'కి చాలా తేడా ఉందని చెప్పారు.

ముఖ్యంగా విష్ణు చాలా బాగా చేశారని.. ప్రభాస్ అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. అన్నీ బాగున్నాయి కానీ, ఆ సినిమాకి అంత ఖర్చు పెట్టాలా? అంత బడ్జెట్ అవసరమా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పిండి కొద్ది రొట్టెలాగా మన దగ్గర ఉన్న డబ్బులతో సినిమా తీసినా కూడా ఇంతే డబ్బులు వచ్చేవని అన్నారు. కానీ భారీ హంగులతో రూ.100 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి, డబ్బులు రాలేదు అంటే అది కరెక్ట్ కాదన్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదని.. బాహుబలి, RRR, కల్కి, పుష్ప సినిమాలని దాటాలని అనుకోవడంలో తప్పులేదన్నారు. కానీ అందుకు తగిన కథ కావాలని.. కన్నప్ప భక్తిరస చిత్రమని ఆ తరహా సినిమాలు కేవలం మన లోకల్ ఆడియన్స్ కే కనెక్ట్ అవుతాయని వివరించారు.
పాత కన్నప్పతో పోల్చి చూస్తే పాన్ ఇండియా మోజులో భక్తిని పోగొట్టుకున్నారని తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. సినిమాకి అవసరమైన భక్తిని.. బడ్జెట్ డామినేట్ చేసిందని చెప్పుకొచ్చారు. తన ఉద్దేశంలో కన్నప్ప సినిమాని ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి తీసి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భక్తి లెవెల్లో తక్కువ ఆలోచించారని కానీ ఆ విధంగా ఎక్కువ ఆలోచించి ఉంటే ఆ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు.

అంతే కాకుండా ఈ సినిమాలో శివుడు పార్వతి అసలు నచ్చలేదని.. వారిని చూస్తేనే ఇరిటేషన్ వచ్చిందన్నారు. విష్ణు కష్టానికి తగ్గ ఫలితం అయితే నిజంగా థియేట్రికల్ గా రాలేదని.. ఓపెనింగ్ వచ్చి కొంచెం మనశ్శాంతి ఇచ్చిందన్నారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications