నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోను అంటున్న బ్రహ్మానందం..

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దాదాపు 1200కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజాతో కలిసి 'బ్రహ్మ ఆనందం' అనే సినిమాలో బ్రహ్మీ నటించారు. అయితే తండ్రీ కొడుకులు కాస్త ఈ సినిమాలో తాత మనవడిగా నటించడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రహ్మానందం.. తన స్నేహితుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను సంపాదించిన సంపద నమ్మకం.. ఒక వ్యక్తికి తన డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి.. అతడికి ఎంతోమంది తెలుసు.. ఎన్నో పరిచయాలు కూడా ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు ఇలా అనేక బంధాలు ఉన్నాయి.

that I will never forget that incident - Brahmanandam

కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలి అనిపించడం.. ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకోవడం.. నోటితో తన కోరికను చెప్పలేక.. మాట్లాడలేని పరిస్థితిలో.. ఏం చేయాలో తెలియక.. పక్కనే వున్న తన కూతురికి సైగ చేసి.. తన కూతురితో తెల్ల కాగితం మీద.. నేను బ్రహ్మానందం అన్నను ఇప్పుడే చూడాలి అని రాసి ఇచ్చారట. అది చదివి అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను.. దర్శకుడు దగ్గరకు వెళ్లి.. తాను అడిగిన విషయం చెబితే ఏమంటారో అనే భయం వేసి, ఆ తర్వాత అలాగే కారు ఎక్కి వెళ్ళిపోయాను అని అన్నారు.

అక్కడి నుంచి ఎంఎస్ నారాయణను చూడడానికి వెళ్లగానే బెడ్డుపై నుంచి నన్ను చూసి రెండు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చేయి పట్టుకొని అక్కడే ప్రాణాలు వదిలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదలడం చూసి ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకరకంగా చెప్పాలి అంటే ఆయన నా రక్తసంబంధం కాదు.. కానీ అదే ఒక హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులోనే వెళ్ళిపోతాడు అని నేను అనుకోలేదు అంటూ బ్రహ్మానందం వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+