ట్యాంక్ బండ్ విగ్రహాల రగడ

నిజాంపై పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన గోండు నాయకుడు కొమురం భీము విగ్రహాన్ని ప్రతిష్టంచకుండా సీమాంధ్రులకు సంబంధించిన విగ్రహాలనే ఎక్కువగా ప్రతిష్టించారనే ఆరోపణ వినిపిస్తోంది. ట్యాంక్ బండ్ పై ఎక్కువగా సీమాంధ్రుల విగ్రహాలు ఉన్న మాట వాస్తవమే. సమాజానికి చేసిన సేవలో అది గుర్తింపునకు సంబంధించింది. అలాంటి సేవను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తే తెలంగాణలో అంతకన్నా ఎక్కువ త్యాగాలు, సేవలు చేసినవారున్నారు. కొమురం భీము, అల్లూరి సీతారామారాజు చేసిన పోరాటాలు ఒకే విధమైనవి. పోరాట తీరులోనూ, త్యాగంలోనూ ఒకరికొకరు తీసిపోరు. అటువంటప్పుడు అల్లూరి సీతారామారాజు విగ్రహం ట్యాంక్ బండ్ పై ఉండి, కొమురం భీము విగ్రహం లేకపోవడమేమిటనే ప్రశ్న రావడం అత్యంత సహజమైన విషయం.
అలాగే, అత్యంత వివాదంగా మారిన మరో విగ్రహం మహాకవి శ్రీశ్రీది. ఆయన తెలంగాణ గురించి ఏమీ రాయలేదనేది తెలంగాణవాదుల ఆరోపణ. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో ఆయన నిజాం సంస్థానంలో పని చేశారు. ఇది కూడా తెలంగాణకు సంబంధించి శ్రీశ్రీకి ఉన్న మచ్చ. అయితే, ఆయన రాసిన దాన్ని చూడాలా, రాయని దాన్ని వాదానికి తీసుకోవాలా అనేది ప్రశ్న. రాసిన దాన్ని బేరీజు వేయడమే న్యాయం. అయితే, తెలంగాణకు ఏమీ చేయలేని ఓ వ్యక్తి విగ్రహాన్ని తెలంగాణకు నడిబొడ్డున ఉన్న హైదరాబాదులో ఎందుకు ప్రతిష్టించాలనే ప్రశ్న ఒక విధంగా న్యాయమైందే. అలాగే, మిగతా మహా పురుషులకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కందుకూరి వీరేశలింగం కృషి అంతా రాజమండ్రి, కోస్తా ప్రాంతాల్లో సాగింది. ఆయన కన్నా ముందు అటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టిన మహా పురుషుడు తెలంగాణలో ఉన్నాడని తెలంగాణ చరిత్ర పరిశోధకులు తేల్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మహాపురుషులకు జరిగిన అన్యాయం చాలా ఉంది. ఈ నేపథ్యంలో కెటిఆర్ ప్రకటనను చూడాల్సి ఉంటుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications