ప్రభుదేవా తన భార్య రమాలతని వదిలించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఆయన నయనతారని అఫీషియల్ గా వివాహం చేసుకుంటానని ప్రకటించిన తర్వాత రమాలత నిరాహార దీక్షకు రెడీ అయింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె తన భర్తను వదులుకోవటానికి సిద్దంగా లేదు. అయితే తాజాగా కుదిరిన పెద్ద మనుషుల ఒప్పదం ఆమెను ఈ విషయంపై వివాదం లేకుండా విడాకులకు ప్రిపేర్ చేస్తాయని అంటున్నారు. ఇందులో భాగంగా నయనతార...ఒక కోటి రూపాయల విలవ చేసే నక్లెస్ ని, మూడు కోట్ల రూపాయల విలువ చేసే క్యాష్ నీ, చెన్నైలో ఓ బంగ్లాని ఇప్పటానికి రెడీ అయ్యిందని సమాచారం. ఇక రమాలత కూడా తాను విసిగిపోయానని, ఏదో విధంగా పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని సెటిల్మెంట్ చేసుకుంటే మేలనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే మహిళా సంఘాలు మాత్రం ఈ సెటిల్మెంట్ కి ఒప్పుకునేలాగ కనపడటం లేదు. వారు...రమాలత తరుపున పోరాడతామనే చెప్తున్నారు. ఆమెకు న్యాయం చేయాల్సిందే అంటున్నారు. నా పరిధిలో నేను న్యాయం చేసుకుంటాను అంటే ఒప్పుకునేలా వారు లేరు అని అక్కడ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుదేవా అంతటి సెలబ్రెటీతో పోరాటం అంటే వారికీ కాస్త పబ్లిసిటీనే కదా అని గిట్టని వారు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా ఏం జరగనుందో చూడాలి.