దర్శకులారా...ఈ నత్త నడకేల

ఇప్పటి దర్శకులు ఒక సినిమా మరొ సినిమాకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటున్నారు. పరిశ్రమలో పేరు మోసిన దర్శకులు..బి. గోపాల్, బోయపాటి, వివి వినాయక్, శీను వైట్ల, శేఖర్ కమ్ముల, సుకుమార్, సురేందర్రెడ్డి, సుకుమార్, క్రిష్ తదిరుల స్పీడు బాగా తగ్గి పోయంది.'మస్కా" వచ్చి మూడేళ్లయినా సీనియర్ దర్శకుడు బి గోపాల్ నుంచి మళ్లీ ఇంత వరకు సినిమా రాలేదు.
ఈయన పరిస్థితి ఇలా ఉంటే...సంవత్సరన్నర క్రితం వచ్చిన 'నమో వెంకటేశ సినిమా" తర్వాత మహేష్ బాబుతో దూకుడు ప్రారంభించిన శీను వైట్ల ఇంకా దాన్ని పూర్తి చేయనేలేదు. అదుర్స్ తర్వాత బ్రదీనాథ్ ను తీసుకురావడానికి వినాయక్ చాలా టైం తీసుకున్నాడు. వేదం తర్వాత ఏం సినిమా చెయ్యాలనే దానిపై క్రిష్ కు ఇంకా స్పష్టత రాలేదు. కేక సినిమా వచ్చి కొన్నేళ్లు గడిచినా తేజ నుంచి మళ్లీ సినిమా ఉసే లేదు.
లీడర్ తర్వాత శేఖర్ కమ్ముల సైలెంట్ అయిపోయాడు. ఇలా పేరు మోసిన దర్శకులందరూ నత్త నడకన నడుస్తున్నారు. అయితే...రాజమౌళి ఒక్కడు మాత్రమే మగధీర లాంటి పెద్ద సినిమాలతో పాటు మర్యాదరామన్న, ఈగ లాంటి చిన్న సినిమాలు చేస్తూ అందరి కంటే ముందున్నాడు.
మరి ఎందుకీ ఆలస్యం? నిర్మాతలు దొరకడం లేదా? హీరోలు ఒప్పుకోవడం లేదా? కథలు లేవా?...అంటే అన్నీ ఉన్నాయి. స్క్రిప్టు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నా....అగ్ర దర్శకులాంతా అగ్రహీరోల కాల్షీట్ల కోసం ఎదురు చూడటం ఓ కారణం అయితే, కొందరు దర్శకులు స్క్రిప్టు కోసం ఎక్కువ సమయం తీసుకోవడం మరో కారణం.
ఈ పరిస్థితి మారాలంటే.....దర్శకుల ఆలోచనలో మార్పు రావాలి. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే కాకుండా, చిన్న సినిమాలు చేస్తూ వేగం పెంచాలి. అప్పడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది.












Click it and Unblock the Notifications