వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్ మ్యాచ్‌లు: పోలీసుల వలయంలో చిన్నస్వామి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రెకెట్ మ్యాచ్ లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను గుర్తు తెచ్చుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండ అన్ని మ్యాచ్ లు సవ్యంగా జరగడానికి ఎర్పాట్లు చేస్తున్నారు.

38 వేల మంది ఫోటోలు, 1,500 మంద పోలీసులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 38 వేల మంది క్రికెట్ మ్యాచ్ చూడటానికి అవకాశం ఉంది. క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వచ్చేవారందరి ఫోటోలు తియ్యాలని పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. స్టేడియం లోపలికి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరి ఫోటో తియ్యడానికి ఎర్పాట్లు చేశారు.

చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశించే అన్ని గేట్ లలో 20 ప్రాంతాలలో ఒక్కోక్క చోట రూ. మూడు లక్షల విలువైన అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఎర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా సోదాలు చేసి స్టేడియం లోపలికి పంపించాలని భద్రతా ఎర్పాట్లకు హాజరవుతున్న సిబ్బందికి పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

chinnaswamy stadium ipl matches: Heavy police security

స్టేడియం దగ్గర ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఫోటోలు తీసే బాధ్యతను బెంగళూరు నగరంలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి అప్పగించారు. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి అయ్యాయి. అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొవాలని సూచించారు.

బాంబు దాడి గుర్తుంది

2010 ఏప్రిల్ 17వ తేదిన ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సంఘటనలు గుర్తు పెట్టుకుని ఇప్పుడు అనేక జాగ్రతలు తీసుకుంటున్నారు. స్టేడియంలోకి వెళ్లే వారి ఫోటోలు తీయ్యాలని, ఎప్పటి కప్పుడు సీసీ కెమెరాలు పరిశీలించాలని సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహకులను పోలీసు అధికారులు సూచించారు.

ఈ ఫోటోలు పరిశీలించి నేర చరిత్ర ఉన్న వారు ఎవరైనా క్రికెట్ మ్యాచ్ కు వచ్చారా అని గుర్తించడానికి అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. శనివారం సాయంత్రం నుండి చిన్నస్వామి స్టేడియం పోలీసుల ఆధీనంలో ఉంటుంది.

English summary
Two bombs went off at the gates of Bangalore's Chinnaswamy Stadium 17/04/2010. Accordiing to television reports, eight people, including three policemen were injured when the bombs, which were hidden in a plastic bag and placed adjacent to a wall, went off. There are conflicting reports about the exact timing of the blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X