వైయస్ బాటలో సిఎం కిరణ్

గతంలో దివంగత వైయస్ కూడా 2008లో అణు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్షనుండి గట్టెక్కించడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులను కొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు వైయస్‌ను కలవడం అనుమానాలకు దారితీసింది. ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారనే ఆరోపణలు వైయస్ బాటలో కిరణ్ పయనిస్తున్నారా అనే సందేహాలకు తావిస్తోంది. ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్‌తో సహా పలువురు కిరణ్‌ను కలిశారు.
అంతేకాదు పార్టీలో ఉంటూ తన పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి వారు తన దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ఏ పనైనా చేసే వారని అంటారు. ఇప్పుడు కిరణ్ కూడా అదే దారిలో వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ వర్గానికి చెందిన పలువురిని ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఖమ్మం తదితర జిల్లా ఎమ్మెల్యేలకు పార్టీలో ఉంటనే ప్రయోజం ఉంటుందని, మీ నియోజకవర్గం కోసం కావాల్సినవి అడిగితే వెంటనే ఆమోదం తెలుపుతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు సాక్షాత్తూ మాజీ పార్లమెంటు సభ్యుడి సొంత జిల్లా ఆయన వర్గం నేతలైన కడప జిల్లా ఎమ్మెల్యేలు గతంలో తన దగ్గరకు వచ్చి నియోజకవర్గం కోసం నిధులు అడగగానే కిరణ్ కేటాయిస్తానని హామీ ఇచ్చారంట.
అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతలు ఎదుర్కొనడంలో వైయస్‌లాగే చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబుపై వైయస్‌లాగే ఘాటుగా మాట్లాడుతున్నారు. పలు ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గెలిపించుకోవడానికి యుక్తి పన్నుతున్నారు. అయితే పరిపాలన విషయంలో వైయస్‌లాగే ఉన్నప్పటికీ అధిష్టానం విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తేడా కనిపిస్తున్నట్టుగా ఉంది. అధిష్టానం వైయస్ చెప్పినట్లుగా నడుచుకునేదని అంటారు. కానీ సిఎం కిరణ్ మాత్రం అధిష్టానంపైన అన్నింటికీ ఆధారపడుతున్నారు.