చిరు బ్యాక్ బెంచ్, శోభా అనర్హత: విలీనంపై తొందరొద్దు?

విలీనాన్ని ఆమోదించాలంటూ చిరంజీవి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు గతంలోనే లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా సమర్పించారు. అయితే చివరి నిమిషంలో న్యాయ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో స్పీకర్ దానిని పెండింగ్‌లో ఉంచారు. త్వరలో చిరంజీవిని రాజ్యసభకు పంపనున్నారు. అంతకుముందే బడ్జెట్ సమావేశాలలోగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై తేలిపోనుంది. దీంతో ఈ రెండు ప్రక్రియలు పూర్తయ్యే వరకు విలీనానికి ఆస్కారం లేనట్లుగా కనిపిస్తోంది. అలా చేయడం వల్ల శోభపై వేటుకు అనుకూలంగా ఉండటంతో పాటు చిరంజీవికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications