వారి మాటే బాబుకు వేదం, పరిష్కారానికి వారే!

రమేశ్ వర్గంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అధ్యక్షుడు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా, అమలు చేయాలన్నా సుజనా, నామా, రమేశ్ ప్రమేయం తప్పనిసరి అంటున్నారు. ఇటీవలి వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న దాడి వీరభద్ర రావు కూడా టిడిపిని వీడక ముందే ఇదే విషయం బహిరంగంగా చెప్పారు.
పార్టీ కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి వెళ్లిందని, వారి ప్రమేయంతోనే అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. బాబు తన కోటరీకి అనుకూలమైన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయంటున్నారు. రాజ్యసభ టిక్కెట్, కేబినెట్ హోదా ఉండే మండలి ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడిని నియమించనున్నట్లు బాబు కోటరీ సభ్యులు ముందే ప్రకటించారని అంటున్నారు.
పార్టీలో తలెత్తే విబేధాలు, వివాదాల పరిష్కారానికి కూడా తన కోటరీనే బాబు ప్రయోగిస్తున్నారట. దాడిని బుజ్జగించే బాధ్యతను కోటరీ ముఖ్యులైన సుజనా, నామాలకు అప్పగించినా విఫలమయ్యారు. కొద్ది రోజుల కిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో వివాద పరిష్కారానికి కూడా కోటరీ లాబీనే బాబు రాయబారానికి పంపారట. కడియం శ్రీహరికి పార్టీలో కొద్దిరోజుల పాటు కీలక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించారు. ఆ తర్వాత కడియంకు బదులు మోత్కుపల్లిని ప్రోత్సహించడం ప్రారంభించారట.












Click it and Unblock the Notifications