కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై వైయస్ జగన్ శిబిరం వ్యక్తిగత విమర్సలకు దిగుతోంది. సోనియా గాంధీ తన కుటుంబ సభ్యులను కూడా సహించలేదనే వాదనను ముందుకు తెస్తోంది. దశాబ్దాల కిందటి విషయాలను ముందుకు తెచ్చి సోనియా వ్యక్తిత్వంపై బురద చల్లేందుకు వెనకాడడం లేదు. సంజయ్ గాంధీ మరణించిన తర్వాత ఆయన భార్య మనేకా గాంధీని ఇందిరా గాంధీ ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి సోనియా గాంధీయే కారణమని ఆరోపిస్తోంది. మనేకా గాంధీకి వ్యతిరేకంగా సోనియా గాంధీ తన అత్త ఇందిరా గాంధీకి ఏమేమో నూరిపోశారని, అందువల్లనే మనేకాను ఇందిరా గాంధీ మనేకాను వెళ్లగొట్టారని ఆరోపిస్తోంది. వైయస్ జగన్ ఏనాడూ అలా చేయలేదని, తన కుటుంబ సభ్యులను మోసం చేయలేదని వారు చెప్పుకుంటున్నారు. అలా చేయకపోతే వైయస్ వివేకానంద రెడ్డి ఎందుకు వైయస్ జగన్ పక్కన ఉండడద లేదని అడిగేవారు కూడా ఉన్నారు కదా.