మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: రాములమ్మ అవాక్కు, సొంతూర్లో డొక్కా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medak people obstruct Vijayashanthi
మెదక్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి మంగళవారం సొంత నియోజకవర్గంలో ప్రజలు షాక్ ఇచ్చారు. తమకు గెలిచినప్పటి నుండి ఏం చేశావని రాములమ్మను నిలదీశారు. దీంతో అవాక్కవడం విజయశాంతి వంతయింది. మంగళవారం ఆమె వర్గల్ మండలం మీనాజీపేటలో జరిగిన రచ్చబండలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలు ఆమెను నిలదీశారు. నాలుగేళ్ల కాలంలో ఎంపీ నిధులతో గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్థులకు సర్దిచెప్పాలని చూసిన రాములమ్మ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు.

కాగా విజయశాంతి 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు. అనంతరం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆమె అటువైపు అడుగులు వేశారు.

మరోవైపు మంత్రి మాణిక్య వర ప్రసాద్‌కు తన సొంతూర్లో సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా గురజాలలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు వస్తున్న విషయం తెలిసుకున్న సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary

 Medak Parliament Constituency people obstructed MP Vijayasanthi on Tuesday at Rachabanda programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X