చిరుకు నిన్న తమ్ముడు, నేడు పార్ట్‌నర్! (పిక్చర్స్)
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవికి సార్వత్రిక ఎన్నికల ముందు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలె జనసేన పార్టీని స్థాపించడమే కాకుండా... కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకులైన బిజెపి, టిడిపిలకు మద్దతిస్తానని ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. తాజాగా చిరు వ్యాపార భాగస్వామి (మాటివిలో పెట్టుబడులు), సహ నటుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా మోడీతో సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు.
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాల్లోనే విజయం సాధించింది. జగన్ కొత్త పార్టీ పెట్టి కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం ఎదుర్కొన్న సమయంలో చిరంజీవి కాంగ్రెసు పార్టీని ఆదుకొని, ఆ తర్వాత తన పార్టీని అందులో విలీనం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చిరుకు షాకులు తగులుతున్నాయి.
మంత్రి గంటా శ్రీనివాస రావు పిఆర్పీ తరఫున 2009లో గెలుపొందారు. కాంగ్రెసు పార్టీలో విలీనం తర్వాత చిరు అండతోనే మంత్రిగా అయ్యారు. అలాంటిది ఆయన ఇటీవలే చిరుకు షాకిస్తూ సైకిల్ ఎక్కారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడు నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థితో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిరంజీవి
చిరంజీవికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయన అండతో మంత్రిగా ఎదిగిన గంటా శ్రీనివాస రావు టిడిపిలో చేరగా, తమ్ముడు పవన్ పార్టీని స్థాపించి విపక్షాల వైపుకు నిలబడ్డారు. తాజాగా నాగార్జున మోడీని కలువనున్నారు.

పవన్ కళ్యాణ్
జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, టిడిపిలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెసును మట్టి కరిపించాలని పిలుపునిస్తున్నారు.

నాగార్జున
నాగార్జున సోమవారం సాయంత్రం మోడీని కలుస్తున్నారు. నాగ్ అహ్మదాబాద్ పర్యటన... తన సతీమణి అమలకు విజయవాడ టిక్కెట్ కోసమా? బిజెపికి మద్దతు తెలిపేందుకా? అనే చర్చ సాగుతోంది. మోడీకి నాగార్జున కూడా జై కొడితే చిరుకు పెద్ద దెబ్బే అంటున్నారు.

గంటా శ్రీనివాస రావు
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ పైన గెలిచారు. పిఆర్పీ కాంగ్రెసులో విలీనం అయ్యాక ఆయన చిరు అండతోనే మంత్రి అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications