రాజ్‌నాథ్ సింగ్‌కు జగన్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టాలని, తాను కలిసి వస్తానని జగన్ రాజ్‌నాథ్ సింగ్‌తో చెప్పినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నారు. రెండు రోజుల క్రితం జగన్ ఈ ఆఫర్ ఇచ్చారట.
తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, అందువల్ల ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకోవద్దని జగన్ రాజ్‌నాథ్ సింగ్ చెవులో ఊదినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ బిజెపి అగ్రనేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ హవా నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో గెలుపు బాటలో పయనించే పార్టీలతోనే పొత్తులు పెట్టుకోవాలని జగన్ అన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి రాష్ట్రంలో 33 పైగా లోకసభ స్థానాలు వస్తాయనీ, ఎన్నికల తర్వాత బిజెపికే మద్దతు పలుకుతానని జగన్ చెప్పినట్లు సమాచారం.
సీమాంధ్రలో తమ బలం విపరీతంగా ఉందని, అవసరమైతే తాను ఎన్డియెలో కూడా చేరుతానని జగన్ రాజ్‌నాథ్ సింగ్‌తో చెప్పారట. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపిపై విభజన విషయంలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో జగన్ పాచిక పారుతుందో, లేదో చూడాలి.












Click it and Unblock the Notifications