వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురును చూసి పదేళ్ళు అవుతోంది, భర్త, కూతురుతో కలిసి ఒక్క రోజైనా గడపాలి

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా శిక్షను అనుభవిస్తోన్న నళిని ఆత్మకథ నవంబర్ 24వ, తేదిన విడుదల కానుంది. ఐదువందల పేజీల ఆత్మకథ తమిళంలో ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు. వారి కూతురు మాత్రం ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోంది. తన తల్లిదండ్రులను విడుదల చేయాలని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.జైల్లో పుట్టిన కూతురు లండన్ లో పెద్ద డాక్టర్ కావడం ఆ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.అయితే తమ కూతురుతో కనీసం ఒక్కరోజైనా గడపాలని ఆ దంపతులు కోరుకొంటున్నారు.భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన నళిని మురుగన్ దంపతుల ఆకాంక్ష ఇది.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని ఆమె భర్త మురుగన్ చెన్నై జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. వారి కూతురు ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోంది. కూతురును చూడక ఆ దంపతులు పదేళ్ళు అవుతోంది.అయితే ఒక్కసారైనా తమ కూతురుతో ఒక్కరోజైనా గడపాలని కోరుకొంటున్నారు.కని అనాథగా వదిలేసినందుకు ఆ దంపతులు తన కూతురును క్షమాపణ అడగాలని అనుకొంటున్నారు. తన జీవితన చరిత్ర నళిని రాసింది. ఈ జీవిత చరిత్రను నవంబర్ 24వ, తేదిన విడుదల కానుంది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న నళిని చివరికోరి తన భర్త, కూతురుతో కనీసం ఒక్కరోజైనా గడపాలని, ఆ కోరిక తీరుతోందో లేదోనని ఆమె ఆవేదన చెందుతోంది.25 ఏళ్ళుగా ఆమె జైలులోనే ఉంటుంది. చెన్నై వేలూరు సెంట్రల్ జైలులో ఆమె ఉంటుంది. నళిని ఆత్మకథ పేరుతో తమిళంలో ఈ పుస్తకం నవంబర్ 24వ, తేదిన విడుదల కానుంది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు వెలుగుచూశాయి.

I would be to spend a day with my husband and daughter :nalini

కూతురు కోసమే థర్డ్ డిగ్రీ టార్చర్ ను అనుభవించాను..

చెన్నైలో తన తల్లితో తాను కలిసి జీవించేదని నళిని తన ఆత్మకథలో చెప్పింది. తన తల్లి చైన్నెలో నర్స్ గా పనిచేసేదని చెప్పింది. 1991 లో శ్రీహరన్ అనే వ్యక్తి తమ ఇంట్లో అద్దెకు దిగాడని, అతనితో తాను ప్రేమలో పడ్డానని నళిని చెప్పింది. తల్లిని ఒప్పించి పెళ్ళిచేసుకొన్నానని ఆమె వివరించింది. శ్రీలంక తమిళుడైన శ్రీహారి కోసం అతని బందువులు తరచూ తమ ఇంటికి వచ్చేవారని ఆమె చెప్పారు.ఒకరోజు భర్తతో కలిసి ఇంటి నుండి పారిపోయామన్నారు. కొద్దిరోజులకే సిబిఐ అధికారులు తమతో పాటు 14 మందిని అరెస్టు చేశారని ఆమె చెప్పారు. పోలీసులు అరెస్టు చేసేనాటికి తాను గర్భవతినని ఆమె తన ఆత్మకథలో చెప్పారు.తన బిడ్డకోసమే పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ టార్చర్ ను అనుభవించినట్టు ఆమె చెప్పారు.

కోర్టుకు విచారణకు వచ్చేసమయంలో తనకు వైద్యపరీక్షలు నిర్వహించేవారని ఆమె చెప్పారు.అయితే ఉరిశిక్షపడబోతున్న తనకు అబార్షన్ చేయాలని పోలీసులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చారని, డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదని ఆమె గుర్తుచేసుకొన్నారు. తనకు అబార్షన్ చేయకుండా అడ్డుకొన్న డాక్టర్లకు ఆమె ధన్యవాదాలు చెబుతున్నారు. ఆ డాక్టర్లు ఎక్కడున్నారో తెలియదు...కాని తన బాగు కోరుకొన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

భర్త, కూతురితో కలిసి ఒక్కరోజైనా గడపాలి...చివరి కోరిక

జైలులోనే తాను ఆడపిల్లకు జన్మనిచ్చాను. ఆమెకు ఆరిత్రా అని పేరు పెట్టాం.తాను ఉంటున్న జైలులోనే తన భర్త కూడ ఉండేవాడు.పక్కనే మగవాళ్ళ బ్యారక్ ఉన్న భర్తతో కలిసి మాట్లాడే అవకాశం లేదన్నారు. తనకు బిడ్డకు రెండేళ్ళ వయస్సున్న సమయంలో తన భర్త బంధువులు వచ్చి తన కూతురును తీసుకెళ్ళిపోయారని ఆమె చెప్పారు. 2005 లో చివరిసారిగా తన కూతురును చూశానని ఆమె చెప్పారు. తన కూతురు ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని బంధువులు చెప్పినప్పటి నుండి సంతోషంగా ఉందన్నారు. తన కూతురు, భర్తతో కలిసి కనీసం ఒక్కరోజైనా గడపాలని ఆమె కోరుకొంటున్నారు. ఇదే తన చివరి కోరికగా చెబుతున్నారు. జైలులో ఉన్న తమను విడుదల చేయాలని తన కూతురు భారత ప్రభుత్వాన్ని కోరుతున్న విషయాన్ని కూడ ఆమె ఈ పుస్తకంలో పొందుపర్చారు.రెండువేల సంవత్సరంలో భారతప్రభుత్వం తమకు క్షమాభిక్ష పెట్టిన తర్వాత జైలులో ఉన్న తన భర్తతో ప్రతి 15 రోజులకు ఒక్కసారి కలిసి మాట్లాడే అవకాశం దొరికిందని, ఇది కొంత ఊరటగా ఉందన్నారు.

ప్రియాంకగాంధీ ఎందుకు కలిసిందో ఇప్పటికీ తెలియదు

రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంథీ తనను కలిశారని చెప్పారు. అయితే ఆమె కలిసేటప్పటికీ ఆమె ప్రియాంకా అని కూడ తెలియదన్నారు. తనతో చాలాసేపు మాట్లాడిందని ఆమె వివరించారు. తన తండ్రి చాలమంచివాడని ఎందుకు చంపారని ఆమె పదే పదే ప్రశ్నించిందని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఈ ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేవన్నారు. ఆమె తనను ఎందుకు కలిశారో తెలియదన్నారు.తన భర్త శ్రీహరన్ మురుగన్ గా ఎందుకు మారాడో కూడ తెలియదన్నారు. రాజీవ్ గాంధీ గురించి తెలియదన్నారు. ఈ పుస్తకం చదివితే మనలో సందేహలకు సమాధానాలు లభించే అవకాశం ఉండొచ్చు.నవంబర్ 24వ, తేదిన మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి హరిపరానథమన్, ఎండిఎంకె పార్టీ నేత వైకో, వీసీకే నేత తిరుమావలవన్, తదితరుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకానినికి సినీ నటుడు సీమాన్ ముందు మాటలు రాశాడు.

English summary
nalini, nurugan assassination in ex pime minister rajivgandhi .they are in vellur central jail past 25 years.naliini murugan couple had a daughter arithra. arithra now working as a doctor in london. with her husband also daughter stay at least a day is the nalini's wish. nalinis autobiography will be relese on novermber 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X