అరటి పండ్లు రోజూ తింటున్నారా..!?

అరటి పండ్లు పోషకాహారంలో భాగంగా తీసుకుంటారు. ఇందులో B6, విటమిన్‌ C పుష్కలంగా ఉంటాయి. మెగ్నిషియం, పొటాషియం మాంగనీస్‌, ఫైబర్‌ లు అరటి పండులో మెండుగా ఉంటాయి. అరటి పండ్లు మంచి శక్తి వనరు. అరటిపండ్లలో సహజ కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్) సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊహించని ఫలితాలు కలుగుతాయి. అయితే, ప్రతీ రోజూ అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

అరటి పండును మితంగా తింటే సమస్య ఉండదని డాక్టర్లు చెబుతారు. అరటిపండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వాటిలో ఉండే పెక్టిన్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అరటిపండ్లలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటిపండ్లు ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని అందిస్తాయి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా..!?
ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా..!?
bananas-are-generally-well-tolerated-but-some-people-might-experience-bloating-gas-or-cramping

మితంగా తీసుకుంటే ప్రయోజనాలు

అరటి పండు మంచి మానసిక స్థితిని కాపాడుకోవడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సెరోటోనిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం కండరాలను బలంగా ఉంచడంలో, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల సమస్యలు, గుండె క్రమరాహిత్యాలకు కారణమవుతుంది. కానీ ఇది చాలా అరుదు. అయితే అరటి పండ్లు మూత్రపిండ రోగులకు ప్రమాదం. డయాబెటిక్‌(సుగర్‌) ఉన్నవారు అరటి పండ్లను తినొద్దు. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది. చెక్కెర స్థాయిలు పెరిగితే దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉన్నవారు వీటి జోలికి పోకపోతేనే మంచిది. నార్మల్‌ లెవెల్స్‌ మెయింటేన్‌ చేసేవారు ఎక్కవగా పండని, దోరగా ఉన్న పండును ఉదయం సగం, సాయంత్రం సగం తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో కొవ్వులు ఏమీ ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+