ఏపీలో వేసవి సెలవుల పొడిగింపుపై సర్కార్ నిర్ణయం ఇదే..!

ఏపీలో వేసవి సెలవులు (summer holidays) పూర్తి కావొచ్చాయి. కొత్త విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇంకా పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, తెలంగాణలో సైతం పాఠశాలలకు వేసవి సెలవుల్ని రెండు రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ పొడిగింపు ఇవ్వాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం (AP govt) ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఇవాళ విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి వేసవి సెలవులు పొడిగింపు ఏమీ లేదని అధికారులు తేల్చిచెప్పేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సెలవులు పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. స్కూల్స్ యథావిధిగా ఈ నెల 12న పునఃప్రారంభం అవుతాయని, ఆ తర్వాత కూడా కొనసాగుతాయని తేల్చిచెప్పే్శారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని విద్యార్ధులతో పాటు తల్లితండ్రుల్ని కూడా అధికారులు కోరారు.

AP Govt Clarifies on School Summer Holiday Extension Here s the Official Word

వాస్తవానికి తెలంగాణలో స్కూళ్ల పునఃప్రారంభ తేదీ మార్చడం వెనుక రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడమే. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం యథావిధిగా ఈ నెల 12న స్కూల్స్ ప్రారంభించి, అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్కూల్స్ రీఓపెనింగ్ యథాతథంగానే ఉంటుందని, వేసవి సెలవుల పొడిగింపు ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మరో మూడు రోజుల్లో విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+