తిరుమలలో అరుదైన ఘట్టం, భక్తులకు అద్భుత అవకాశం- తాజా మార్పులతో..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్లు భక్తులతో నిండాయి. దర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. శ్రావణ మాసం.. సెలవులతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కాగా.. ఈ నెలలో తిరుమలలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంటోంది. ఈ రోజు గరుడ పంచమి పర్వదినం వేళ రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా.. భక్తులకు దర్శనం, వసతి పొందేందుకు టీటీడీ కీలక నిర్ణయం వెల్లడించింది.
ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు "గరుడపంచమి" పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఈ నెలలోనే రెండు సార్లు గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ రోజు.. అదే విధంగా ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శనివారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా.. నవంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దర్శనం..వసతి టికెట్ల జారీ తేదీలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

నవంబర్ కోటా దర్శనం.. వసతి టికెట్లు
ఇక.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి న కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద ల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications