మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!
మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించారు. నాగాబాబు కు మంత్రి పదవి ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇక, కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీ ఖాయమని ప్రచారం సాగింది. అయితే, ఇప్పటి వరకు మంత్రి పదవి ఊసే లేదు. ఈ సమయంలోనే నాగబాబుకు కీలక పదవి కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా.. ఇక నాగబాబు మంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా అనే కొత్త చర్చ ఇప్పుడు కూటమిలో మొదలైంది.
ఏపీలో 2024 ఎన్నికల సమయంలో కూటమి ఏర్పాటు నుంచి నాగబాబుకు పదవుల విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో తొలుత అనకాపల్లి నుంచి నాగబాబును బరిలో కి దించాలని భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. బీజేపీ ఆ సీటు కోరటం తో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ దక్కింది. అయితే..ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో.. నాగబాబుకు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తరువాత నాగబాబు మంత్రి అయ్యారు. రెండో విడత రాజ్య సభ సభ్యులు నియమితులయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తయింది. నాగబాబు కు మంత్రి పదవి పైనా ఎలాంటి స్పష్టత లేదు. ఈ సమయంలోనే నాగబాబుకు కీలక పదవి పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక మంత్రి పదవి ఉన్నట్లా.. లేనట్లా
మంత్రి అవుతారని భావించిన నాగబాబుకు ఇప్పుడు నామినేటెడ్ పదవి దక్కింది. జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును 'గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ' చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఈ పదవికి కేబినెట్ హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది. నాగబాబు ఈ పదవి ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణ మరియు మొక్కలు నాటే ప్రాజెక్టుల పరిశీలన, పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక నాగబాబు కు మంత్రి పదవి ఉన్నట్లా.. లేనట్టా అనే చర్చ ఇప్పుడు కూటమి నేతల్లో మొదలైంది. స్థానిక సంస్థలకు సిద్దం అవుతున్న వేళ తాజా నియామకం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications