నిరుద్యోగులకు తీపి కబురు.. ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. ఎప్పుడంటే!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పదే పదే మెగా డీఎస్సీ పైన సంచలన ఆరోపణలు చేస్తూ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలతో కూటమి సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం మరో డీఎస్సీకి సిద్ధమవుతోంది. అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం.
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించి ప్రాథమిక జాబితా రూపొందించింది. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, పురపాలక పాఠశాలలు, గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ, దివ్యాంగ రెసిడెన్షియల్ సంస్థలు, ఆదర్శ పాఠశాలలు తదితరాల్లో కలిపి 2,500కు పైగా టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 2,250 పోస్టులు ఉండే అవకాశం ఉంది. మిగతా విభాగాల నుంచి మూడు వందల వరకు ఖాళీలు రావచ్చని అంచనా.

డీఎస్సీతోపాటు డైట్, ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160, జూనియర్ లెక్చరర్లు 209, లైబ్రేరియన్ పోస్టులు వంద వరకు ఉండనున్నాయి. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే
ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఆ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 2026 నోటిఫికేషన్‌తో పాటు 2027, 2028, 2029 సంవత్సరాలకు కూడా ఖాళీల జాబితాను శాఖ సిద్ధం చేసింది.
మొత్తం ఖాళీల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం నేరుగా నియామకం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన ఈ డీఎస్సీ నోటిఫికేషన్ నిర్ణయం యువతకు కొత్త ఆశలకు వేదిక అవుతుంది. దీని ద్వారా వారు ఉపాధ్యాయులుగా తమ కలలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో రానున్న నోటిఫికేషన్ కు సంబంధించి తుది సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు అధికారికంగా వెలువడతాయి. ఏది ఏమైనా ఒక వైపు ప్రతిపక్ష పార్టీల దాడిని తట్టుకుంటూనే మళ్ళీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications
