ఖాకీల వేషంలో కామాంధులు: పోలీసులమని చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్!

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఓ పార్కులో 17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి కల్కాజీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం సమీపంలో ఉన్న పార్కుకు వెళ్లింది. అక్కడ దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు వ్యక్తులు తమను పోలీసులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు దిగారు. వారిలో ఒకడు గన్, కత్తితో భయపెట్టి బాలికపై లైంగిక దాడికి పాల్పడగా.. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కూడా దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీని వణికించిన క్రైమ్: యువతిపై గ్యాంగ్ రేప్ హత్య - కుక్కలు ఏం చేశాయంటే..!!
ఢిల్లీని వణికించిన క్రైమ్: యువతిపై గ్యాంగ్ రేప్ హత్య - కుక్కలు ఏం చేశాయంటే..!!

రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పీసీఆర్ కాల్ రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Delhi Horror Minor Gang Raped in Park Encounter Lead to Arrest of 1 Accused two are on the run
యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!
యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!

ఈ క్రమంలో ఓ నిందితుడు అమర్ కాలనీ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఎంతో కష్టపడి అతడిని పట్టుకున్నారు. నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అతడి కాలికి గాయం చేసి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని ఆసిఫ్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. రాజధాని ఢిల్లీలో కేవలం 10 రోజుల వ్యవధిలో మైనర్ బాలికలపై జరిగిన నాలుగో లైంగిక దాడి ఘటన కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+