రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఊపిరాడక ఇద్దరు పసిబిడ్డలు మృతి

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి ఊహించని విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాపల వార్డులోనే మృత్యువు అగ్ని రూపంలో విరుచుకుపడింది. ఎస్‌ఎన్‌సీయూ (SNCU) విభాగంలో ఉన్న ఏసీ యూనిట్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో పేలిపోవడంతో ఆసుపత్రి మొత్తం పొగచూరిపోయింది. క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపల ఉన్న పసికందులు ఊపిరాడక విలవిలలాడారు. ఆ నరకయాతన మధ్య కేవలం ఐదు రోజుల పసికందుతో పాటు మరో నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అద్దాలు పగలగొట్టి దేవుళ్లలా కాపాడిన తల్లిదండ్రులు, సిబ్బంది

కాళరాత్రి 11:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో ఆసుపత్రి కాంప్లెక్స్ అంతా హాహాకారాలతో నిండిపోయింది. వార్డులో దట్టమైన పొగలు రావడంతో లోపలికి వెళ్లడం అసాధ్యంగా మారింది. అయితే, ప్రాణాలకు తెగించిన ఆసుపత్రి సిబ్బంది, బాధితుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిటికీల అద్దాలను పగలగొట్టి సాహసోపేతంగా లోపలికి దూసుకెళ్లారు.

Tragedy at Adilabad RIMS Two Newborns Die as AC Unit Explosion Triggers Fire in Hospital SNCU Ward
సహజీవన సుఖం కోసం పసి ప్రాణాన్ని ఎంత హింసించారో చూడండి!
సహజీవన సుఖం కోసం పసి ప్రాణాన్ని ఎంత హింసించారో చూడండి!

ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న దాదాపు 26 మంది చిన్నారులను ఎంతో శ్రమించి బయటకు తీసుకువచ్చి కాపాడుకున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేగా, ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారులను వెంటనే ఆదిలాబాద్‌లోని ఇతర ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.. దర్యాప్తుకు ఆదేశం!

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. పురిటిలోనే ఇద్దరు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, భవిష్యత్తులో రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+