ఆ రెండు తుఫాన్లను మించిన ముప్పు-అక్వాన్ పై తేల్చేసిన పవన్..! రేపటి నుంచి..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ పై మరింత అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు తెలిపారు. గత రెండు తుఫాన్లతో పోలిస్తే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం మొదలు కాబోతుందన్నారు. నెల్లూరు-తుని మధ్య ఇది తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోందన్నారు. కాబట్టి భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదని, గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు.

దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!
దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!

అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు.

Pawan Kalyan Warns Officials Over Cyclone Akvan Says Impact Could Be Worse Than Arnab and Murasu
పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!
పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!

ఈ నెల 19, 20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు.తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పవన్ సూచించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలన్నారు.

Pawan Kalyan Warns Officials Over Cyclone Akvan Says Impact Could Be Worse Than Arnab and Murasu
Cyclone Akvan: తుని నుంచి విశాఖకు విస్తరించిన తుఫాన్-రాత్రికి తీవ్రం-ఐఎండీ అప్డేట్..!
Cyclone Akvan: తుని నుంచి విశాఖకు విస్తరించిన తుఫాన్-రాత్రికి తీవ్రం-ఐఎండీ అప్డేట్..!

పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం, వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలని, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+