"తండ్రి వయస్సున్న వ్యక్తితో చెట్టాపట్టాలా ?- జగన్ పై తీవ్రంగా మండిపడ్డ షర్మిల..!

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తాజాగా తన కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందించారు. దీనిపై వైసీపీ పత్రిక సాక్షిలో చంద్రబాబుతో షర్మిల చెట్టాపట్టాల్ అంటూ ప్రచురించిన కథనాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

ధోనీ రిటైర్మెంట్ పై జగన్ ఆసక్తికర ట్వీట్..! సీఎస్కేలో కొత్త రోల్ పైనా..!
ధోనీ రిటైర్మెంట్ పై జగన్ ఆసక్తికర ట్వీట్..! సీఎస్కేలో కొత్త రోల్ పైనా..!

తనపై సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరమన్నారు. తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం అన్నారు. వైసీపీ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట అన్నారు. జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదన్నారు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదన్నారు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదని, వారి మానసిక స్థితి మెరుగుపడలేదని విమర్శించారు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అన్నారు. ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు అని ప్రశ్నించారు.

YS Sharmila Launches Sharp Attack on Jagan Sakshi Over Article on Chandrababu s Wedding Invitation
చంద్రబాబుతో షర్మిల భేటీ..! తప్పకుండా రావాలంటూ..!
చంద్రబాబుతో షర్మిల భేటీ..! తప్పకుండా రావాలంటూ..!

తన కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉందన్నారు. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబును వైఎస్సార్ ఆహ్వానించారని, అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్సార్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? అని ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే జగన్ .. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+