కనెక్షన్ కట్.. వృథా చేస్తే ఖబడ్దార్!

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఓ వైపు ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. మరోవైపు పెరుగుతున్న నగర అవసరాల దృష్ట్యా ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడాలని జలమండలి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. కొందరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!
తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!

తాగునీటితో వాహనాలు, ఫ్లోర్లు కడగడం, నల్లాలు తెరిచి ఉంచడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండి నీరు పొంగిపొర్లుతున్నా పట్టించుకోకపోవడం వంటి నిర్లక్షపు చర్యలపై జలమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో మొదట అవగాహన కల్పించి, హెచ్చరికల అనంతరం రూ.1000 నుంచి రూ.20,000 వరకు జరిమానాలు విధించినా కొందరు ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలను వేగవంతం చేశారు.

Hyderabad Water Crisis HMWSSB to Cut Connections for Repeat Water Wastage while leaks must be fixed

జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు
తాగునీటి వృథాను అరికట్టే చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం నీటి సరఫరా సమయంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాగునీటిని అనవసరంగా వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించి నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ఈ రోజు మనం నిర్లక్ష్యంగా వృథా చేసే ప్రతి నీటి చుక్క.. రేపు మరొకరి తాగునీటి అవసరం కావచ్చు. జరిమానాలు విధించడం జలమండలి లక్ష్యం కాదు.. నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం. పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జలమండలి స్పష్టం చేసింది.

ఇకపై తనిఖీలు ముమ్మరం.. రెండోసారి పట్టుబడితే కనెక్షన్ తొలగింపు

తాగునీటి వృథాపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జలమండలి హెచ్చరించింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా సమయాల్లో ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. తాగునీటిని వృథా చేస్తూ మొదటిసారి పట్టుబడిన వారికి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని, అదే వినియోగదారుడు రెండోసారి నీటిని వృథా చేస్తూ పట్టుబడితే సంబంధిత నీటి కనెక్షన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

నీటిపారుదల ప్రాజెక్టుల నిధుల విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త!
నీటిపారుదల ప్రాజెక్టుల నిధుల విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త!

ప్రజలకే కాదు.. జలమండలి వ్యవస్థలో నీటి వృథాకూ చెక్
ప్రజలకు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచిస్తున్న జలమండలి.. తన వ్యవస్థలో జరిగే నీటి వృథాను అరికట్టడంపైనా అంతే బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయించింది. జలమండలి పరిధిలో సుమారు 15 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించిన తాగునీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉండగా, పైప్‌లైన్ లీకేజీల కారణంగా విలువైన తాగునీరు వృథా కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ గుర్తించిన వెంటనే స్పందించి, గరిష్ఠంగా 24 గంటల్లోగా లీకేజీని అరికట్టి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

నీటిని వృథా చేయొద్దని ప్రజలకు చెబుతున్నప్పుడు.. జలమండలి కూడా తన వ్యవస్థలో ఒక్క చుక్క నీరు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజల నీటి వృథాపై ఎంత కఠినంగా వ్యవహరిస్తామో.. పైప్‌లైన్ లీకేజీల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపైనా అంతే కఠినంగా వ్యవహరిస్తాం. లీకేజీ తెలిసినా నిర్ణీత సమయంలో స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని, నీటి సమర్థ నిర్వహణలో ఎవరి నిర్లక్ష్యాన్నీ సహించేది లేదని తేల్చిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+