ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి మామూలు రెస్పాన్స్ లేదుగా!

తెలంగాణా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలని సంకల్పించింది తెలంగాణా ప్రభుత్వం. ఈ క్రమంలో మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దే పనిలో ఉంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి అనేక మార్గాలను చూపిస్తోంది. ఈ క్రమంలో బీసీ మహిళల కోసం అందిస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుండి ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా వెయ్యి మంది చొప్పున మొత్తం 1.19 లక్షల మంది బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ఈ పథకం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Intintiki Indiramma kuttu machine scheme Minister Ponnam Prabhakar said over 4 06L applications received so far

ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఇంట్లో కూర్చునే కుట్టు పని ద్వారా ఆర్ధిక స్వావలంబన సాధించవచ్చని ఆయన అన్నారు. మంత్రుల క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు.

గతేడాది కంటే ఈసారి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని, గురుకులాల్లో డిజిటల్ విద్య అందించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం 321 గురుకులాల్లో కేవలం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలున్నాయి.

లైంగిక నేరస్తులపై ఏపీ సర్కార్ సీరియస్ యాక్షన్.. వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు, నిఘా!
లైంగిక నేరస్తులపై ఏపీ సర్కార్ సీరియస్ యాక్షన్.. వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్లు, నిఘా!

అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి వెంటనే భూసేకరణ చేసి సొంత భవనాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. స్థలం అందుబాటులో ఉన్న చోట్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా మహిళలలో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం అమలుపై చైతన్యం పెరగడం సంతోషకరమని మంత్రి అభిప్రాయపడ్డారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+