8 రఫేల్ ఫైటర్ జెట్స్ ను కూల్చేశాం.. IAF కు చుక్కలు చూపించాం: మరోసారి పాకిస్థాన్ ఫేక్ ప్రచారం

గతేడాది పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ మరోసారి అబద్ధపు ప్రచారం చేస్తోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ భారత్ పై విష ప్రచారం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ ఫైటర్ జెట్స్ ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చేసిందని తప్పుడు కథనాన్ని చెప్పుకొచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసినా పాకిస్థాన్ మాత్రం పదే పదే ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించడం ఆ దేశ వక్ర బుద్ధిని చాటుతోంది.

Pakistan spreads false propaganda once again claiming they shot down 8 Rafale fighter jets in 2025

పంజాబ్ అసెంబ్లీ లో స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రతీ రెడ్ లైన్ ను క్రాస్ చేసిందని.. దాంతో భారత్ కు పాకిస్థాన్ ఘాటుగా సమాధానం చెప్పిందని నోరు పారేసుకున్నారు. అంతేకాక పాకిస్థాన్ ఆర్మీ ధాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తట్టుకోలేకపోయిందని నోటికొచ్చినట్లు మాట్లాడారు. పాకిస్థాన్ పై భారత ప్రధాని మోదీ చూపిన కోపం బ్యాక్ ఫైర్ అయిందంటూ మాట్లాడారు. మే 2025 యుద్ధంలో భారత్ కు చెందిన 8 రఫేల్ ఫైటర్ జెట్స్ ను కూల్చేశామని విష ప్రచారం చేశారు. ఓ వైపు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలక ఉగ్ర స్థావరాలను భారత్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ పాకిస్థాన్ మాత్రం పదే పదే భారత్ పై తప్పుడు ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ పై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+