భారతీయులకు సడెన్ షాకిచ్చిన మలేషియా.. ఇకపై కొత్త రూల్స్..!

భారతీయులకు మలేషియా షాక్ ఇచ్చింది. వీసా- ఫ్రీ సదుపాయాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 డిసెంబర్ 31 తో వీసా- ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని భారతీయ టూరిస్టులకు రద్దు చేస్తున్నట్లు ఈమేరకు మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అంతేకాక 2027 జనవరి 1 నుంచి మలేషియాలోకి ప్రవేశించాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ముందుగానే వీసా పొందాల్సి ఉంటుందని ప్రకటించింది.

తాజా నిర్ణయంతో భారతీయ టూరిస్టుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో అక్కడి ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే తప్ప.. భారతీయులు మలేషియా చేరుకోవడానికి ముందుగానే అందుకు చెల్లుబాటయ్యే వీసాను తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. ఈ మేరకు మలేషియాకు చెందిన మై వీసా పోర్టల్ లో డిసెంబర్ 1, 2026 నుంచి వీసా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

అంతకుముందు భారతీయులకు వీసా సౌకర్యం లేకుండానే 30 రోజుల పాటు మలేషియాను చుట్టేసే విధంగా రూల్స్ ఉండేవి. పర్యటకలు బిజినెస్, టూరిజం, సోషల్ లేదా ట్రాన్సిట్ ట్రిప్స్ కోసం పర్యటించేవాళ్లు.. కానీ తాజాగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ మలేషియా ఆ రూల్స్ ను మార్చింది.

Malaysia ends visa free entry for Indians new rules to take effect from January 1 2027 Malaysia

ఇక వీసా మినహాయింపు లేని విదేశీ పౌరులు మలేషియాలోకి ప్రవేశించాలంటే కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌ పోర్ట్ అవసరం అని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ మలేషియా స్పష్టం చేసింది. అంతేకాక మలేషియాలో ఎన్ని రోజులు బస చేస్తారో అందుకు తగిన ఆర్థిక స్తోమత ఉన్నట్లు రుజువులను కూడా కలిగి ఉండాలని పేర్కొంది. మరోవైపు 30 రోజుల వీసా-ఫ్రీ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సెప్టెంబర్‌ లోనే అంటే రెండు నెలల ముందే భారత హైకమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే ఇకపై మలేషియా టూర్ ప్లాన్ చేసుకునే భారతీయులు మై వీసా పోర్టల్ ద్వారా ముందుగానే వీసా తీసుకుని ప్రయాణాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+