మరో రాష్ట్ర విభజన?- నాలుగు ముక్కలుగా- మోడీ వ్యూహం ఇదేనా?

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ను (UP) కేంద్రం విభజించబోతోందా ? రాష్ట్రంలో కుల గణన తర్వాత మారబోతున్న రాజకీయ పరిస్ధితుల్ని ముందుగానే అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకోబోతోందా ? కేంద్రంలో సమీకరణాలకు కీలకంగా ఉన్న యూపీలో గత లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి పట్టు తప్పిందా లేక విభజనతో మరింత పట్టు చిక్కుతుందని ఆశిస్తుందా ? ఎన్డీయే మిత్రపక్ష నేత ఓపీ రాజ్ భర్ కు ప్రధాని మోడీ ఇచ్చిన సంకేతం చూస్తే కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి.

యూపీలో సీన్ రివర్స్- వీరికే ఎడ్జ్..! తేల్చేసిన ఇండియాటుడే తాజా సర్వే..!
యూపీలో సీన్ రివర్స్- వీరికే ఎడ్జ్..! తేల్చేసిన ఇండియాటుడే తాజా సర్వే..!

ప్రస్తుతం చేపడుతున్న కుల గణన తర్వాత ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజిస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్లు ఎన్డీయే మిత్రపక్షం ఎస్బీఎస్పీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ తెలిపారు. ఈ విభజనను 27 శాతం రిజర్వేషన్ల అంశంతో ముడిపెట్టిన రాజ్‌భర్.. కొత్తగా ఏర్పడే పూర్వాంచల్ రాష్ట్రానికి ఒక రాజ్‌భర్ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. దీంతో విభజనపై కేంద్రం, బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు అర్దమవుతోంది.

UP to Be Split Into 4 After Caste Census OP Rajbhar Claims PM Modi Gave Assurance
బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?
బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?

చిన్న రాష్ట్రాల ఏర్పాటే తమ విధానమని చెప్పుకునే బీజేపీ, యూపీ కంటే ఎన్నో చిన్న రాష్ట్రాల్ని ముక్కలు ముక్కలుగా విభజించిన బీజేపీ, ఉత్తర్ ప్రదేశ్ ను మాత్రం విభజించేందుకు ఇప్పటివరకూ మొగ్గు చూపలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అయోధ్య చుట్టూ సాగిన బీజేపీ రాజకీయాలు సుస్థిరం కావాలంటే విభజన అనవసరమని ఇంతవరకూ భావించింది. కానీ గత లోక్ సభ ఎన్నికల్లో యాదవ్-ముస్లిం ఓటు బ్యాంక్ సాయంతో ఎస్పీ-కాంగ్రెస్ తమను దెబ్బకొట్టడం, తాము నిర్మించిన అయోధ్య పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ లోక్ సభ సీటులో సైతం ఓటమి పాలవ్వడంతో బీజేపీ పునరాలోచనలో పడక తప్పలేదు.

UP to Be Split Into 4 After Caste Census OP Rajbhar Claims PM Modi Gave Assurance
యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!
యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!

వాస్తవానికి ఉత్తరప్రదేశ్ విభజన డిమాండ్ చాలా కాలంగా రాజకీయ అంశంగా ఉంది. గతంలో బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి దీన్ని బలంగా సమర్థించారు. పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ్ ప్రదేశ్‌లుగా యూపీని విభజించేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌భర్ ప్రధాని మోడీ చెప్పారంటూ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది గత ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన కోసం వచ్చిన డిమాండ్లను గుర్తుచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+