దసరా నుంచి ఈ రాశులకు దరిద్రం పట్టుకున్నట్లు అదృష్టం పట్టుకుంటోంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల గమనాలు, స్థానాల ఆధారంగా ప్రతి ఏటా పండగలు, విశేష సమయాల్లో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది దసరా సమయానికి గ్రహాల స్థితిగతుల రీత్యా కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశి వారికి దసరా సమయం నుంచి ఆర్థికంగా తిరుగు ఉండదు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అన్నిరకాలుగా కలిసివస్తుంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలి.

మిథున రాశి
మీ మాటతీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఆఫీసులో లేదా వ్యాపారంలో పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ కాలంలో నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి శుభవార్తలు అందుతాయి.














Click it and Unblock the Notifications
