రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన టిప్పర్ డ్రైవర్.. రూ. 500 తో రూ. 12 కోట్ల జాక్ పాట్

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పడం కష్టం..లక్‌ కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు.. అలా కరోడ్ పతులు అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే పంజాబ్ కు చెందిన ఓ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. రూ. 500 తో లాటరీ కొనుగోలు చేయగా.. దీపావళి సందర్భంగా వెల్లడైన ఫలితాల్లో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. ఆయన 2010 నుంచి లాటరీ టికెట్స్ ను కొనుగోలు చేస్తుండగా దాదాపు 15 ఏళ్ల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయన కృషి ఫలించిందని ఇవాళ నా కల నెరవేరిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో ఆ టిప్పర్ డ్రైవర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు.

పంజాబ్ లోని దేరాబస్సీ జిల్లా హుమాయున్ పూర్ కు చెందిన బల్జిందర్ సింగ్(45) ను రాత్రికి రాత్రే అదృష్టం వరించింది. దీపావళి పండగ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన డియర్ దీపావళి లాటరీ ఫలితాల్లో బల్జిందర్ సింగ్ ఏకంగా రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. కేవలం రూ. 500 తో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆయనకు ఇంత మొత్తంలో నగదు రావడంతో సంతోషంతోపాటు భావోద్వేగానికి లోనయ్యాడు. తాను ఓ రైతుని.. అలాగే డ్రైవర్ ను అని గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్నానని.. అయితే ఇవాళ తన కల నెరవేరిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ విషయం తెలిసిందని దేవుడు చివరగా నా ప్రార్థనలను గుర్తించి దీవించాడని పేర్కొన్నాడు.

lottery Rs 12 crore win for a Rs 500 ticket a jackpot for a tipper truck driver in Punjab news

తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి భవిష్యత్తుకోసం ఈ డబ్బును ఉపయోగిస్తానని బల్జిందర్ సింగ్ తెలిపారు. ఇక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయనకు తన లాటరీ డబ్బు చేరనుంది. పంజాబ్ స్టేట్ డియర్ దివాళి బంపర్ 2026 లాటరీ లో ఈ ఏడాది దీపావళి సందర్భంగా మొత్తం 36 లక్షల టికెట్స్ ను విక్రయించారు. ఈ లాటరీ ఫలితాల్లో తాజాగా బల్జిందర్ సింగ్ రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. ఇక ఇటీవల పంజాబ్‌ లోని సుల్తాన్‌ పుర్‌ లో జీవనం సాగిస్తున్న ఓ సాధారణ పెయింటర్ ను ఇలాంటి అదృష్టమే వరించింది. ఆయన కేవలం రూ. 100 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే ఆ లాటరీ టికెట్ కు ఏకంగా రూ.25 లక్షల బహుమతి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+