కేరీర్ లోనే ఎప్పుడూ చేయని రోల్ లో స్టార్ హీరో.. గూస్ బంప్స్ !!

విలక్షణ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్.. ఓ నూతన అవతారంలో వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. తన సినీ కెరీర్‌లో మొదటిసారిగా ఆయన ఒక పౌరాణిక పాత్రలో నటించబోతోన్నాడు. పరాక్రమవంతుడైన కర్ణ..' పాత్రలో కనిపించబోతోన్నాడు. ఈ చిత్రానికి 'మహావీర్ కర్ణ' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ లుక్.. హాట్ టాపిక్ అయింది.

టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అద్భుతమైన విజువల్స్ వండర్. లైవ్ యాక్షన్ సాగా గా రూపొందిస్తున్నట్లు చిత్రం యూనిట్ వెల్లడించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ కర్ణుడి గెటప్‌లో అత్యంత శక్తిమంతమైన యోధుడిగా కనిపించాడు. కవచ కుండలాలతో యుద్ధరంగానికి సిద్ధమైన వీరుడి తరహాలో రాఘవ లారెన్స్ పాత్ర రూపకల్పన చేశారు. గూస్ బంప్స్ తెప్పిస్తోందీ ఫస్ట్ లుక్. వచ్చే ఏడాది ఈ ఫిల్మ్ విడుదల కానుంది.

Hero Raghava Lawrence Steps into Mythology Film as Karna in Epic Transforms for Mahaveer Karna

తెలుగు, తమిళ ప్రేక్షకులకు రాఘవ లారెన్స్ అనగానే ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలు, కామెడీ హారర్ ఎంటర్టైనర్ లే గుర్తొస్తాయి. ఇలాంటి ఛాలెంజ్ తో కూడుకున్న ఓ పురాణ ఆధారిత పాత్రలో నటించడం అతనికి ఇదే మొదటిసారి. దానవీరశూర కర్ణుడి గంభీర వ్యక్తిత్వాన్ని, ఆయనలోని భావోద్వేగాలను లారెన్స్ ఏ విధంగా తెరపై పండిస్తారనేది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ విలక్షణ పాత్ర కోసం తనను తాను మార్చుకున్నట్లు యూనిట్ చెబుతోంది.

బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్
బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్

మహావీర్ కర్ణ.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వీ ఫిలిం హౌస్ బ్యానర్లపై ఈ చిత్రం సంయుక్తంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీతో పాటు ప్రధాన దక్షణాది భాషల్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమాలో ఉపయోగించే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నిర్మాణ విలువలు ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తాయని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు.

రవితేజతో ఖిలాడి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు వంటి మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్స్ అందించారు రమేష్ వర్మ. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ కు ప్రాణం పోస్తోన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రముఖ రచయితలు, టెక్నీషియన్ల టీమ్ పనిచేస్తోంది. రాఘవ లారెన్స్ మాస్ ఇమేజ్‌కు దర్శకుడు రమేష్ వర్మ ఊహాశక్తికి తోడుగా కర్ణుడి చారిత్రక వీరగాథ యాడ్ అవ్వడంతో మహావీర్ కర్ణ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. త్వరలో మిగిలిన స్టార్ క్యాస్ట్ ను కూడా యూనిట్ వెల్లడించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+