వందేమాతరంపై సుప్రీంలో మరో పిటిషన్..! రాజ్యాంగ విరుద్దం, జనగణమనతో సమానమా ?

జాతీయ గేయంగా ఉన్న వందేమాతరంలో (Vande Mataram) 70 ఏళ్లుగా ఆలపిస్తున్న రెండు చరణాలకు తోడు మొత్తం ఆరు చరణాలు పాడాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం, జాతీయ గీతమైన జనగణమనతో సమానంగా వందేమాతరాన్ని పరిగణించడం, కొన్ని సార్లు మరో అడుగు ముందుకేసి జనగణమన స్ధానంలో వందే మాతరం ఆరు చరణాలను పాడటం వంటి ఘటనలపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కర్నాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ (తిరువల్లూరు మురళీకృష్ణ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?
బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?

వందేమాతరం అధికారికంగా నిర్దేశించిన ఆరు చరణాలను పాడాలని కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌తో పాటు, జాతీయ గీతమైన జనగణమనకు కల్పించిన చట్టపరమైన రక్షణను వందేమాతరానికి కూడా వర్తింపజేస్తూ చేసిన సవరణను టీఎం కృష్ణ (T.M. Krishna) సవాల్ చేశారు. వందేమాతరంలోని 3, 4, 5, 6 చరణాల్లో హిందూ దేవతల పట్ల భక్తి వ్యక్తమయ్యే అంశాలు ఉన్నాయని టి.ఎం. కృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి చరణాలను తప్పనిసరిగా పాడాలని ఆదేశించడం భారత రాజ్యాంగంలోని లౌకికతత్వం, మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన పిటిషన్ లో వాదించారు.

Vande Mataram Row Carnatic Musician T M Krishna Moves Supreme Court Against Six-Stanza Singing Mandate
మరో రాష్ట్ర విభజన?- నాలుగు ముక్కలుగా- మోడీ వ్యూహం ఇదేనా?
మరో రాష్ట్ర విభజన?- నాలుగు ముక్కలుగా- మోడీ వ్యూహం ఇదేనా?

అలాగే, వందేమాతరాన్ని జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ పరిధిలోకి తీసుకురావడాని కూడా టీఎం కృష్ణ తన పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ ఏడాది పార్లమెంట్ లో చేసిన చట్ట సవరణ ప్రకారం జాతీయ గీతం లేదా జాతీయ గేయం పాడకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా పాడుతున్న సభకు అంతరాయం కలిగించడం నేరంగా పరిగణించబడుతుందని ఉంది. దీనికి మూడేళ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ చట్టపరమైన మార్పు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని, అలాగే మెజారిటీ మత సందేశాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని టి.ఎం.కృష్ణ అభ్యంతరం తెలిపారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+