ఆస్పత్రులకు వెళ్లాల్సిన పనిలేదు..నిజామాబాద్‌లో ఆరోగ్య సేవా కేంద్రం ప్రారంభం..!!

పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సామాన్యులకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్‌లో నిర్వహిస్తున్న'ఆరోగ్య సేవా కేంద్రం'ద్వారా స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు,డాక్టర్ కన్సల్టేషన్లు,ఉచిత మందులు అందుతుండటంతో పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,800 మందికి పైగా ప్రజలు ఈ కేంద్రాన్ని సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మధుమేహం,బీపీ బాధితులే అధికం
నిజామాబాద్‌లోని ఈ ఆరోగ్య కేంద్రానికి వస్తున్న వారిలో ప్రధానంగా 40 నుండి 80 ఏళ్ల వయస్సు గలవారు ఎక్కువగా ఉంటున్నారు.మారుతున్న జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న హైపర్‌టెన్షన్ (రక్తపోటు), మధుమేహం(షుగర్), అలాగే సాధారణ జ్వరాలతో బాధపడుతున్న వారే అధికంగా వైద్యుల సలహాలు పొందుతున్నారు.ఇప్పటివరకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో2,700 మందికి పైగా రక్తపోటు (హైపర్‌టెన్షన్) పరీక్షలు,1,900 మందికి పైగా మధుమేహం (బ్లడ్ షుగర్) పరీక్షలు పూర్తి చేశారు.వీటితో పాటు దాదాపు 1,900 మందికి పైగా ల్యాబరేటరీ సేవలు పొందగా, మొత్తం 2,600 రకాల ల్యాబ్ టెస్టులను ఉచితంగా నిర్వహించారు.3,300 కంటే ఎక్కువ ఫార్మసీ విజిట్లలో ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాకుండా,శ్వాసకోశ సమస్యల నివారణకు అర్హులైన వారికి 150 కి పైగా న్యూమోకాకల్ (Pneumococcal) టీకాలను కూడా వేశారు.

nizamabad-health-centre-free-tests-doctor-consultation-and-medicines-for-3-800-people

స్థానికంగా అందుబాటులో ఉచిత రోగ నిర్ధారణ
ఈ కేంద్రంలో నిరంతరం ఒక ఎంబీబీఎస్ డాక్టర్,నర్స్ మరియు సహాయక సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు వైద్యం అందిస్తున్నారు.ఇక్కడ హెమోగ్లోబిన్,ర్యాండమ్ బ్లడ్ షుగర్,మూత్ర పరీక్షలు (షుగర్ మరియు అల్బుమిన్),మలేరియా గుర్తింపు కోసం ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు (RDT) వంటి ప్రాథమిక పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు.దీనివల్ల నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు ల్యాబ్ ఖర్చులు మందుల భారం గణనీయంగా తగ్గుతోంది.

కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ప్రాథమిక వైద్యం
ఈ ఉచిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల కింద,'పిరమల్ స్వాస్థ్య'భాగస్వామ్యంతో ఏర్పాటు చేసింది. "ప్రాంతీయ స్థాయిలో ఉచిత ప్రాథమిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.నిజామాబాద్‌లోని కేంద్రానికి నిత్యం సగటున 15 మందికి పైగా రోగులు వస్తున్నారు. ముందస్తు రోగ నిర్ధారణ మరియు అవగాహన ద్వారా ఎన్నో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే నియంత్రించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న 32 ఆరోగ్య సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరింది" అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ (తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్) శ్రీనివాస్ కేబీబీ తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సీఎస్ఆర్ ప్రాజెక్టు కింద ఉచిత ఆరోగ్య సేవలు కొనసాగుతున్నాయి.ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నివాస ప్రాంతాలకు సమీపంలోనే నాణ్యమైన ప్రాథమిక వైద్యం లభిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+