బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్

దక్షిణ పశ్చిమ రైల్వే.. కుప్పం రైలు ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యాన్ని కల్పించింది. ప్రయోగాత్మక ప్రాతిపదికన రెండు నిమిషాల పాటు ఆయా రైళ్లు ఇక్కడ హాల్ట్ అవుతాయి. నేటి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు.

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ భౌగోళికంగా మూడు రాష్ట్రాల సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. దీనివల్ల నిత్యం వేలాది మంది ప్రయాణికులు చదువు, ఉద్యోగం, వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కుప్పంలో హాల్ట్ సౌకర్యం కల్పించాలనే వినతులు వెల్లువెత్తాయి. వీటిని టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. పరిష్కరించింది.

CM Chandrababu Launches Inaugural Halts for Dadar Puducherry Vasco Velankanni Express at Kuppam
  • నంబర్ 17315 వాస్కోడిగామా - వేళాంకణి ఎక్స్‌ప్రెస్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:33 నిమిషాలకు కుప్పం స్టేషన్ లో హాల్ట్ అయింది. రెండు నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరి వెళ్లింది.
  • తిరుగు ప్రయాణంలో నంబర్ 17316 వేళాంకణి- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం 9:33 నిమిషాలకు కుప్పం స్టేషన్ కు చేరుకుని 9:35 నిమిషాలకు బయలుదేరి వెళ్తుంది.
  • నంబర్ 11005 దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ సోమవారం రాత్రి 22:45 నిమిషాలకు చేరుకుని, 22:47 నిమిషాలకు బయలుదేరి వెళ్లింది.
  • తిరుగు ప్రయాణంలో నంబర్ 11006 పుదుచ్చేరి- దాదర్ ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 3:28 నిమిషాలకు కుప్పానికి చేరుకుని 3:30 గంటలకు బయలుదేరుతుంది.
  • ఒకేసారి నాలుగు దూర ప్రాంతాలకు చెందిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు కుప్పంలో ఆగుతోండటం వల్ల స్థానిక ప్రయాణికులకు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయినట్టయింది.
CM Chandrababu Launches Inaugural Halts for Dadar Puducherry Vasco Velankanni Express at Kuppam

హాల్ట్ సౌకర్యాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం 59 రైళ్లకు కుప్పంలో హాల్ట్ సౌకర్యం ఉందని, భవిష్యత్‌లో మరిన్ని ఎక్స్ ప్రెస్ లకు ఈ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. కుప్పం ఎకనమిక్ హబ్‌గా డెవలప్ అవుతోందని, పెరిగిన రైల్వే హాల్ట్‌లతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసి, రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా మలుస్తామని అన్నారు. భవిష్యత్‌లో బెంగళూరు నుంచి అమరావతికి వందే భారత్ రైళ్లను నడిపేలా కృషి చేస్తామని చెప్పారు.

CM Chandrababu Launches Inaugural Halts for Dadar Puducherry Vasco Velankanni Express at Kuppam

గుడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆర్వోబీకి భూసేకరణ చేస్తున్నామని, డీకే పల్లి చెరువు దగ్గర కూడా ఆర్వోబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నామని ఆయన వివరించారు. బెంగళూర్-చెన్నై మధ్య నాలుగో రైల్వే లైన్ త్వరలోనే వస్తుంది ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. కుప్పం నుంచి చిత్తూరుకు కూడా కనెక్ట్ చేస్తే నేరుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి రైల్ కార్గోకు కూడా పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని, దీనికోసం పొగురుపల్లి దగ్గర డ్రై పోర్టుకు కనెక్ట్ చేసి కార్గో రవాణా మెరుగుపరుస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+