"నేనిక్కడే ఉన్నా- వస్తారా జగన్ ?"- నారా లోకేష్ సవాల్..!
ఏపీలో గతేడాది కూటమి సర్కార్ నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విపక్ష వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటోంది. ప్రభుత్వం చర్చకు రావాలంటూ సవాళ్లు కూడా విసురుతోంది. సీబీఐ విచారణ జరిపించాలంటోంది. అయితే ఇవాళ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ (Nara Lokesh).. డీఎస్సీ వివాదంలో జగన్ ను (Ys Jagan) టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
డీఎస్సీ విషయంలో రాష్టంలో వైసీపీ కృత్రిమ ఆందోళనల్ని రేకెత్తిస్తోందని ఆరోపిస్తున్న నారా లోకేష్.. నాలుగు దశల్లో ఇవి జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు. కేవలం 4 సులభమైన దశల్లో కృత్రిమ ఆగ్రహాన్ని ఎలా సృష్టించాలో ఇక్కడ చూడాలంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ లోకేష్ ఈ ట్వీట్ చేశారు. ఇందులో మొదటి దశలో అసెంబ్లీని బహిష్కరించండి, రెండో దశలో లోపల జరుగుతున్న డీఎస్సీ చర్చకు హాజరుకాకుండా దూరంగా ఉండండి, మూడో దశోల డీఎస్సీపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టండి, నాలుగో దశలో "చర్చకు సిద్ధంగా ఉన్నారా?" అని నన్ను అడగండి అని లోకేష్ పేర్కొన్నారు.

How to manufacture fake outrage in 4 easy steps - ft. @ysjagan:
— Lokesh Nara (@naralokesh) August 17, 2026
Step 1: Boycott the Assembly.
Step 2: Skip the DSC discussion happening inside.
Step 3: Move adjournment notices demanding… a discussion on DSC!
Step 4: Ask me if I’m “ready for a discussion”. 😂
I’m in the House… https://t.co/po81IumaKK
దీనికి కొనసాగింపుగా.. నేను ఈ రోజు సభలో ఉన్నాను, డీఎస్సీకి సంబంధించిన వాస్తవాలను సభ ముందు ఉంచుతున్నాను, మీరు వస్తారా వైఎస్ జగన్ అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తూ వస్తున్న వైసీపీ, వైఎస్ జగన్ ఈసారి కూడా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ విసిరిన సవాల్ చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ సభ్యులు మండలిలో డీఎస్సీ అంశంపై నిరసనలకు దిగుతున్న సమయంలో లోకేష్ ఈ ట్వీట్ చేయడం విశేషం.














Click it and Unblock the Notifications