అర్ధరాత్రి అట్టుడికిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ క్యాంపస్: హైవే సైతం దిగ్బంధం

పంజాబ్‌ జలంధర్ లో ఉన్న ప్రముఖ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వ్యాపించిన కొన్ని వదంతుల నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన సున్నితాంశంపై ఈ వివాదం రాజుకుంది. విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ క్యాంపస్ పరిసరాలను రణరంగంగా మార్చారు.

ఓ విద్యార్థినిపై బయటి వ్యక్తి ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ వ్యవహారంలో ఒక క్యాంపస్ ఉద్యోగి హస్తం కూడా ఉందంటూ కొన్ని అన్ వెరిఫైడ్ పోస్టులు నెట్టింట కనిపించాయి. వీటికి సంబంధించి విశ్వసనీయ సమాచారం లేకపోయినప్పటికీ.. విద్యార్థులు మాత్రం నిరసనలకు దిగారు. ఆందోళనలు చేపట్టారు.

LPU Students Turn Violent Over Unverified Allegations Damage Campus and Protest Disrupts Highway

ఈ సమాచారం అందిన వెంటనే యూనివర్శిటీ యాజమాన్యం, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. ఈ అల్లర్లపై జలంధర్ రూరల్ ఎస్ఎస్పీ గౌరవ్ తూరా అధికారిక ప్రకటన విడుదల చేశారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు విద్యార్థిని మృతి చెందిందనడానికి గానీ, లైంగిక దాడి జరిగిందనడానికి గానీ ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని వివరించారు. బాధిత కుటుంబం నుండి లేదా ఇతరుల నుండి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని పేర్కొన్నారు.

అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా
అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా

ఓ అన్‌వెరిఫైడ్ వైరల్ పోస్ట్ ఆధారంగానే సుమారు 2,000 మంది వరకు విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గర్ల్స్ హాస్టల్ సమీపంలో మొదట్లో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థుల నిరసన క్రమంగా అదుపుతప్పింది. హింసాత్మకంగా మారింది. క్యాంపస్‌లో పెద్ద ఎత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ఫర్నిచర్ ను తగులబెట్టారు విద్యార్థులు. హాస్టల్, ఇతర భవనాల అద్దాలను ధ్వంసం చేశారు. అడ్మిన్ ఆఫీస్ పై రాళ్లు, పూలకుండీలను విసిరారు.

అక్కడితో ఆగలేదు విద్యార్థులు. రోడ్డుపైకి వచ్చిన ధర్నాలకు దిగారు. జలంధర్- ఫగ్వాడా జాతీయ రహదారిని సైతం దిగ్బంధించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. విద్యార్థులతో చర్చలు జరిపాయి. హైవేపై ఆందోళనలను విరమింపజేశాయి. క్యాంపస్ లోపల శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+