వాళ్ల నుంచి నేర్చుకునే స్థితి లేము: ఐరాసలో పాకిస్తాన్ ను ఏకిపడేసిన కేంద్రం

న్యూయార్క్‌లో కొనసాగుతోన్న ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో తాజాగా విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికపై భారత గళాన్ని బలంగా వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచదేవాలు బేషరతుగా కలిసి రావాలని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పట్ల తాము ఎప్పటికీ జీరో టాలరెన్స్ విధానాన్నే అనుసరిస్తామని, తీవ్రవాద దాడుల నుంచి తనను తాను రక్షించుకునే సార్వభౌమత్వ హక్కు తమకు ఉందని తేల్చిచెప్పారు.

140 కోట్లమంది భారతీయుల తరఫున నమస్కారం.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు జైశంకర్. ఉగ్రవాదం మొదలుకుని 4ఎఫ్ వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. భారత వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి అనేక రూపాల్లో అన్నిరకాలుగా సహాయాన్ని అందిస్తోన్న నెట్‌వర్క్‌ల గుట్టను రట్టు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి చర్యలను సమూలంగా అణచివేయాలని పిలుపునిచ్చారు.

Jaishankar at UNGA says India Won t Dilute Zero Tolerance Terrorists Will Held Accountable network

పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఉగ్రవాద విషయంలో ఆ దేశం అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఇదివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టారు. ఆయన ప్రస్తావించిన అంశాలను తోసిపుచ్చారు. ఉగ్రవాద ప్రోత్సాహిత దేశం నుంచి నేర్చుకునే స్థితిలో తాము లేమని అన్నారు. ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకుని, ప్రపంచ దేశాలను మోసం చేయాలనుకునే ప్రయత్నాలు ఇకపై ఎంతమాత్రం సాగబోవని జైశంకర్ హెచ్చరించారు.

ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని
ఆ చర్యను యుద్ధంగానే పరిగణిస్తాం: ఐరాస వేదికగా భారత్ ను డైరెక్ట్ గా హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని

మైత్రి, సద్భావన అనేవి ఉగ్రవాదంతో కలిసి ప్రయాణించలేవని, తీవ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశాలు తమ పద్ధతులను మార్చుకోవాలని హితవు పలికారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సుదీర్ఘకాలంగా పోరాడుతూ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడిని జైశంకరర్ ప్రస్తావించారు కూడా. ఆ దాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్.. స్వీయ రక్షణ కోసమేనని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్ ఇచ్చినప్పుడు భారత రాయబారి రియాక్షన్ ఏదైతే ఉందో.. !!
పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్ ఇచ్చినప్పుడు భారత రాయబారి రియాక్షన్ ఏదైతే ఉందో.. !!

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పారు. ఇటువంటి ద్వంద్వ విధానాలను అనుసరించే దేశాల పట్ల కఠిన వైఖరిని అనుసరిస్తామనీ అన్నారు. పశ్చిమాసియాలో శాంతి భద్రతల పునరుద్ధరణపై మాట్లాడారు జైశంకర్. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి టూ-స్టేట్ సొల్యూషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారమని తాము బలంగా నమ్ముతున్నామని జైశంకర్ చెప్పారు.

పాలస్తీనా, యుద్ధ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు మానవతా సహాయం అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని వివరించారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకలు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను 4ఎఫ్ సంక్షోభంగా జైశంకర్ అభివర్ణించారు.

ఆహారం (Food), ఇంధనం (Fuel), ఎరువులు (Fertiliser), ఆర్థిక వనరులు (Finance) కొరతతో పేద దేశాలు సతమతమౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో పాటు ఎరువుల కొరత వల్ల ప్రపంచ ఆహార భద్రత ప్రమాదంలో పడిందని, కొన్ని దేశాల ఏకపక్ష మార్కెట్ విధానాల వల్ల గ్లోబల్ సౌత్ పారిశ్రామికీకరణ హక్కులు దెబ్బతింటోన్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+