పవన్ ఏంటో అర్దమయ్యేలా త్వరలో చెబుతా తమ్ముడు పేర్ని కిట్టి.. బండ్ల గణేష్ కౌంటర్..!!

ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి- వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా స్థానిక ఎన్నికల పైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మచిలీ పట్నం నేత పేర్ని కిట్టు తాజాగా పవన్ - బండ్ల గణేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. వీటికి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఏంటో అర్దమయ్యేలా చెబుతా అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ నేతలు ఈ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టాయి. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జ్ పేర్ని నాని తనయుడు కిట్టు చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ సాగుతున్న వేళ.. బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చారు. పేర్ని కిట్టు తన ప్రసంగంలో బండ్ల గణేష్ పదే పదే పవన్ గురించి చేసే వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవన్ తనకు ఒక మత్తు అని.. ఒక వ్యసనం అంటూ చెప్పటాన్ని గుర్తు చేసారు. బండ్ల గణేష్ ఒక నిర్మాత కాబట్టి.. సినిమా తీస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన పవన్‌ను అలా పొగుడుతుంటారని ఎద్దేవా చేశారు. అయితే, మాజీ సీఎం జగన్ సినిమాలు చేయరని.. కొడాలి నాని ఏ సినిమా తీయరని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబుతో సహా.. గుడివాడ ఎమ్మెల్యే గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.

 నారా లోకేష్ పై అభ్యర్ధిని ఫిక్స్ చేసిన జగన్, అక్కడే అసలు ట్విస్ట్..!!
నారా లోకేష్ పై అభ్యర్ధిని ఫిక్స్ చేసిన జగన్, అక్కడే అసలు ట్విస్ట్..!!
bandla-ganesh-s-tweet-to-ycp-leader-perni-kittu-on-pawan-kalyan-goes-viral-here-the-details

పేర్ని కిట్టు వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్

గుడివాడలో చంద్రబాబు వచ్చిన సమయంలో జన స్పందన గురించి సెటైర్లు వేసారు. కొల్లు రవీంద్ర సైతం జనం లేకుండానే కార్యక్రమాలు చేస్తారని.. వీరంతా ఈవెంట్లు ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేసారు. కొడాలి నాని కి ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. ఈ వ్యాఖ్యల పైన బండ్ల గణేష్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. బండ్ల తన ట్వీట్ లో.." పవన్ గారు ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో నీకు అన్నీ అర్థమయ్యేలా త్వరలో చెప్తా తమ్ముడు పేర్ని కిట్టి....!! అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు ఇటు వైసీపీ అటు జనసేన శ్రేణులు స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజకీయంగా కొత్త చర్చకు కారణంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+