దసరా నాటికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం!

హైదరాబాద్‌లోని మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనం కోసం తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశను దసరా పండుగ నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన గడువు నిర్దేశం చేసింది. ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ బాధ్యతను ఇప్పటికే ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించారు. ఆ సంస్థ ముంబై, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోని వివిధ బ్యాంకులతో చర్చలు జరిపింది. అయితే బ్యాంకులు కోరుతున్న వడ్డీ రేట్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. మెట్రో రైలును స్వాధీనం చేసుకోవాలంటే ఎల్‌ అండ్‌ టీ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ.13,600 కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

Hyderabad Metro First Phase Takeover Targeted by Dasara Government Pushes for Lower Interest Loans

ప్రస్తుతం ఈ రుణాలపై సగటున ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఇంత ఎక్కువ వడ్డీ భారం భవిష్యత్తులో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై గట్టి ప్రభావం చూపుతుంది. అందుకే తక్కువ వడ్డీతో రుణాలు సమీకరించగలిగితే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్‌ఎఫ్‌సీ గతంలో నాలుగు శాతం లోపు వడ్డీ రేటుతో రుణం ఇవ్వడానికి అంగీకరించింది. కొంత మొత్తం జపాన్ యెన్‌లో, మరికొంత రూపాయల్లో అందించే ప్రతిపాదన కూడా ఉంది. దీనివల్ల సగటు వడ్డీ రేటు నాలుగు శాతం కంటే తక్కువగా ఉండేది. అయితే ఆఖరి నిమిషంలో ఆ రుణ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఎస్‌బీఐ క్యాప్స్ అదే తరహాలో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులను వెతుకుతోంది.

ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం ఇవ్వడానికి ముందుకొచ్చినా, వారు కోరుతున్న వడ్డీ రేటు ఏడు శాతానికి పైనే ఉంది. రుణ సమీకరణ ప్రయత్నాలు ఫలించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్‌ఎండీఏ నుంచి నిధులు సమకూర్చుకునే అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది.

ఓరుగల్లు వాసులకు శుభవార్త: 5వేల కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ లో కీలకఅడుగు!
ఓరుగల్లు వాసులకు శుభవార్త: 5వేల కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ లో కీలకఅడుగు!

అదే సమయంలో ఐఆర్‌ఎఫ్‌సీ రుణం కోసం ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రుణాలు విడుదల చేయాలని మెట్రో అధికారులు నిరంతరం లేఖలు రాస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దసరా నాటికి మొదటి దశ స్వాధీనం పూర్తయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో కీలక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+