అక్టోబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్.. డిసెంబర్ లో పరీక్షలు: తమీమ్

రాష్ట్రంలో డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ పరీక్ష కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. వారికోసం ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ లో కొత్త నోటిఫికేషన్.. డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మరో డీఎస్సీ పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు.

అయితే అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని ఈ మేరకు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు మెగా డీఎస్సీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీచర్ పోస్టుల నియామకాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని పరీక్షలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు.

డీఎస్సీ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ- 2025 ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.

అయినప్పటికీ గత కొన్ని నెలలుగా డీఎస్సీ నియామకాలపై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కొనసాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీలో అమలు చేసిన హారిజాంటల్, వెర్టికల్ రిజర్వేషన్లపై ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారని కమిషనర్ గుర్తు చేశారు.

DSC notification AP October exams to be held in December Education Department Commissioner Tamim

కానీ కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. ఇక అక్టోబర్ లో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్.. డిసెంబర్ లో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+