పండుగల ముంగిట పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్

పండుగ సీజన్ సమీపించిన తరుణంలో పసిడి ప్రియులకు భారీ ఊరట లభిస్తోంది. కొద్ది రోజులుగా వరుసగా రికార్డు ధరలతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. దేశీయ రిటైల్ మార్కెట్ లో కిందటి వారంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములప గరిష్టంగా 3,160 రూపాయల వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 10 గ్రాముల ధరలో రూ. 2,900 మేర క్షీణించింది.

ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకుంటోన్న పరిణామాలేనని విశ్లేషకులు స్పష్టం చేస్తోన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు శనివారం నాటికి 2.1 శాతం మేర పడిపోయాయి. ఔన్స్‌కు 4,282.98 డాలర్లకు పరిమితం అయ్యాయి. ఈ ధరల క్షీణత తాత్కాలికమేనని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ జెఫరీస్ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. దీర్ఘకాలంలో బంగారం ధర రికార్డుస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Gold Prices Flat in India as Global Bullion Trade Faces Pressure Festival Buying Picks Up 22K 24K

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు ప్రస్తుతం రూ.1,52,830 వద్ద స్థిరపడగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 24 క్యారెట్ల పసిడి రూ.1,52,680 వద్ద కొనసాగగా 22 క్యారెట్ల రేటు రూ.1,39,950 వద్ద నిలిచింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ముంబైతో సరితూగాయి. ఇక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,52,680 వద్ద ఉండగా, 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.1,39,950 వద్ద స్థిరపడింది.

అర్ధరాత్రి అట్టుడికిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ క్యాంపస్: హైవే సైతం దిగ్బంధం
అర్ధరాత్రి అట్టుడికిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ క్యాంపస్: హైవే సైతం దిగ్బంధం

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,52,730, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 గా రికార్డయింది. బెంగళూరు, పుణె నగరాల్లోనూ ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,39,950 కాగా 24 క్యారెట్లు రూ. 1,52,680 వద్ద నిలిచింది. కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 మేర భారీ పతనాన్ని చవిచూసింది. తాజా మార్కెట్ వివరాల ప్రకారం కిలో వెండి రూ.2,45,000 వద్ద నిలిచింది.

చార్ సౌ సాల్.. హైదరాబాద్: రేవంత్ బిగ్ మిషన్
చార్ సౌ సాల్.. హైదరాబాద్: రేవంత్ బిగ్ మిషన్

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,284, 22 క్యారెట్లు - రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,780

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+