తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్!

ఏపీలో సీఎం చంద్రబాబు వర్షాలు, వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్య కారులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకునే నిర్ణయం తీసుకున్నారు .

భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో ఏర్పడిన వరద పరిస్థితులపై ఆయన విదేశాల నుంచే సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులు జలమయమైన నివాస ప్రాంతాలు, నీట మునిగిన పంటల వివరాలు, రిజర్వాయర్లకు వస్తున్న నీటి ప్రవాహాల తీరును వివరంగా తెలియజేశారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లు నింపేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కూడా చెప్పారు.

free rice fishermen CM Chandrababu Directs Free Rice for Fishermen Reviews Flood Situation

ఉత్తరాంధ్రలోని ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు శనివారం ఉదయం ఒడిశాలోని పారాదీప్ వద్దకు సురక్షితంగా చేరుకున్నారని అధికారులు సమాచారం అందించారు.భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వర్షపాత లోటు గణనీయంగా తగ్గిందని అధికారులు చెప్పారు.

గతంలో 50 శాతం ఉన్న లోటు ప్రస్తుతం 31 శాతానికి తగ్గిందన్నారు. కోస్తా ప్రాంతంలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహం కొనసాగుతోందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని చెప్పారు.

హిరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు సౌకర్యం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జలవనరులు, విద్యుత్తు శాఖల ఉన్నతాధికారులు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని స్పష్టం చేశారు. లిఫ్ట్ పనులు పూర్తయిన తర్వాత వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్‌లోకి తరలించాలని చెప్పారు. కృష్ణానదికి స్థానికంగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

దసరా నాటికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం!
దసరా నాటికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం!

ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన రెండు ఆనకట్టల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని, ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్రానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కూడా ఆదేశించారు. వరద నీటిని సమర్థంగా నిల్వ చేసుకుని రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+