మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సిద్దం, ముహూర్తం ఫిక్స్..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (సోమవారం) ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల వేదికగా కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో ప్రధాన హామీ అమలుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయి. దీంతో... ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా మారనున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (సోమవారం) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు సభ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మండలికి మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇదే సమావేశాల వేదికగా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. శాసన మండలిలో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్నా యంటున్న అక్రమాలు, ఔట్‌సోర్సింగ్ నియామకాల స్కామ్‌లు, ఇతర ప్రజా సమస్యలపై సభలో తీవ్రంగా నిలదీయాలని జగన్ తమ శాసనసభ్యులను ఆదేశించారు. ఈ అంశాలపై చర్చకు పట్టుబట్టాలని దిశా నిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపు పై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
స్థానిక ఎన్నికల్లో బీసీలకు సీట్ల కేటాయింపు పై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
ap-govt-likely-to-introduce-key-bills-during-monsoon-assembly-sessions-along-with-bc-reservations-bi

అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయం

ఇక, ఇటు ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. బీసీ రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ దిశగా ప్రభుత్వం ఏర్పటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని పైన అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసు కొనే అవకాశం ఉంది. రిజర్వేషన్ల అమలు పైన అసెంబ్లీ వేదికగా బిల్లు లేదా తీర్మానం ఆమోదించి ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అదే విధంగా అసెంబ్లీ వేదికగానే డీఎస్సీ పైన చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+