"మోడీ సార్ మీరే దిక్కు-వీళ్లెవరూ పట్టించుకోవట్లేదు"- విశాఖ ఎయిర్ పోర్ట్ ఉద్యోగి వేదన..!
విశాఖలోదశాబ్దాలుగా పనిచేసిన అంతర్జాతీయ విమానాశ్రయం (Visakhapatnam airport) స్ధానంలో పొరుగున ఉన్న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టును (alluri sitaramaraju international airport) తాజాగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాత వైజాగ్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపాధి లేకుండా పోతోంది. ఈ ఎయిర్ పోర్టు మూతపడటంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగని కొత్తగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టులోనూ వారిని తీసుకోవడం లేదు. దీంతో ఆయా ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేదు.
దీంతో తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తూ.. తాజాగా ఎయిర్ పోర్టు భోగాపురానికి మారడంతో ఉపాధి కోల్పోతున్న హౌస్‌కీపింగ్ ఉద్యోగి గండితి రాము ఏఎన్ఐ వార్తా సంస్థతో తన ఆవేదన వెళ్ళగక్కారు. తాను విశాఖ ఎయిర్ పోర్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఇక్కడి విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేస్తున్నారని, ఇప్పుడు తమకు అండగా నిలిచేవారు ఎవరూ లేరని రాము తెలిపారు. దీనిపై అధికారులను, తమ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయిందన్నారు.

.@ncbn గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 17, 2026
మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని…
తాను వ్యక్తిగతంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని వేడుకున్నానని రాము తెలిపారు. వారు 'చూద్దాం' అని చెప్పి వెళ్లిపోయారన్నారు. తమ సమస్యలను పరిశీలించి సహాయం చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. ఈ సమస్యపై విమానాశ్రయ విభాగం కూడా స్పందించడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. యాజమాన్యం తమ సమస్యలపై స్పందించడం లేదని, అలాగే నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లేదా పౌర విమానయాన శాఖ మంత్రి కూడా స్పందించడం లేదని రాము ఆవేదన వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications