భోగాపురంలో తొలి ఫ్లైట్ లాండ్ వేళ, విశాఖలో ఉద్వేగం- వారికి ఉచిత విమానయానం..!!
భోగాపురంలో సంబరాలు. విశాఖలో ఉద్వేగం. విమానాశ్రయాల వేదికగా చోటు చేసుకున్న ఎమోషన్స్. అయిదు దశాబ్దాలుగా సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం మూసివేసారు. ఇక, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో షెడ్యూల్డ్ విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానం లాండింగ్ సమయంలో.. పండుగ వాతావరణం నెలకొంది. హామీ ఇచ్చిన విధంగా రైతులకు ఉచిత విమానయానం కల్పించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయల్దేరింది. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీసు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు భోగాపురం విమానశ్రయంలో ల్యాండింగ్ అయింది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా, తొలి ప్రయాణంలో పాల్గొన్న వారికి జ్ఞాపకార్థంగా 'ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు' అందజేశారు. కాగా, విశాఖ కేంద్రంగా దాదాపు అయిదు దశాబ్దాల కాలంగా సేవలు అందించిన విమానాశ్రయం లో ఇక రాకపోకలు నిలిచిపోయాయి.

విశాఖ విమానాశ్రయంలో సెల్పీలతో
విశాఖ నుంచి చివరి విమానం బయల్దేరే సమయంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సిబ్బంది ఎమోషనల్ అయ్యారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించిన ఎంతో మంది ఎయిర్‌పోర్ట్ ఆవరణలో సెల్ఫీలు దిగుతూ తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించారు. ఇక, ప్రయాణీకుల కోసం విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్ బస్సులు నడవనున్నాయి. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2,200 వేల మంది రైతులు తమ భూములను ఇవ్వగా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు (సోమవారం)ఉదయం కొంతమంది అన్నదాతలకు విమాన ప్రయాణం కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. ఇక, తొలి రోజు భోగాపురం వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ అధికారులు స్వాగతం పలికి, ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందిస్తున్నారు. ఇప్పటికే భోగాపురం నుంచి రాకపోకలు సాగించే విమానాల షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications